Chiranjeevi: ‘నా భార్య క్యాన్సర్‌తో చనిపోతే’.. మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయంపై ఉత్తేజ్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు ఉత్తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ తో తన భార్య చనిపోయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఉత్తేజ్.

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలు చేసిన మంచి పనుల గురించి ఒక పుస్తకం రాసినా సరిపోదు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకన్నారు. చిరంజీవి, ఉత్తేజ్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్‌ను అన్నయ్య అని పిలిచే కోట్లాది మందిలో ఉత్తేజ్ కూడా ఒకరు. కాగా సుమారు నాలుగేళ్ల క్రితం (2021, సెప్టెంబర్ 13) ఉత్తేజ్ భార్య పద్మావతి క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆ సమయంలో ఉత్తేజ్ తో పాటు అతని కూతురు మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని భోరున విలపించడం అందరినీ కలచివేసింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు చేసిన సహాయం గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఉత్తేజ్.
‘ నా భార్యకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉందనే విషయాన్ని చెప్పడానికి చిరంజీవి దగ్గరికి వెళ్లాను. ఈ విషయం చెప్పగానే చిరంజీవి ఓ గాడ్ అంటూ నన్ను హగ్ చేసుకున్నాడు. ట్రీట్మెంట్ ఏది కావాలంటే అది చేద్దాం నువ్వు ధైర్యంగా ఉండమని ధైర్యమిచ్చారు. కానీ అప్పటికే క్యాన్సర్ బాగా ముదిరిపోవడంతో పద్మ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. ఒకరోజు మార్నింగ్ తనకకు బాగా సీరియస్ గా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నాకు అప్పుడే అనిపించింది తను మనకింకా లేదని. డాక్టర్లు కూడా వచ్చి అదే విషయాన్ని చెప్పారు. నేను వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి ఏడుస్తూ పద్దు ఇక లేదన్నయ్యా అని చెప్పాను. అప్పుడు షూటింగ్ లో ఉన్న ఆయన వెంటనే నీ పక్కన ఎవ్వరు ఉన్నారు అని అడిగారు. ఎవ్వరు లేరన్నయ్య అని చెప్పగానే ఓ గాడ్ అని నేను హాస్పిటల్ కి వస్తున్నానని చెప్పి వెంటనే వచ్చేశారు. మా ఆస్పత్రి బిల్లుతో పాటు 11 రోజుల కార్యక్రమాలకు అయ్యే ఖర్చులన్నింటినీ అన్నయ్యే భరించారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉత్తేజ్.
చిరంజీవితో ఉత్తేజ్, కూతురు పాట ఉత్తేజ్
View this post on Instagram
ప్రస్తుతం చిరంజీవి గురించి ఉత్తేజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అన్నయ్య మంచి మనసుకు ఇది మరో నిదర్శనమంటూ మెగాభిమానులు స్పందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








