చిరంజీవి మనవరాలు.. క్లీంకార డైట్ ఇదే..
పసిపిల్లల ఆహారం విషయంలో తల్లులు చాలా జాగ్రత్త వహిస్తారు. వారి ఎదుగుదలకు అవసమైన పోషకాహారాన్ని పిల్లలకు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వయసుకు తగిన ఆహారాన్ని అందిస్తూ ఎంతో శ్రద్ధ వహిస్తారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన పాప క్లీంకారాకు పెట్టే డైట్ గురించి వివరించారు. అందరు తల్లులలాగే తానుకూడా తన పాప ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇటీవలే ఓ సందర్భంలో తన కూతురికి తాను అందించే ఓ ప్రత్యేక ఆహారం గురించి వివరించారు ఉపాసన. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మెగా ప్రిన్సెస్ క్లీంకారకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తుంటుంది. రామ్‌చరణ్-ఉపాసనలు కూడా తమ కూతురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు, ముఖం కనిపించకుండా తీసిన ఫొటోల్ని తరచూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఈసారి తన బుజ్జాయి తీసుకునే ఆహారం గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఉపాసన. రోజూ క్రమం తప్పకుండా తన పాప ఆహారంలో చేర్చే ఓ పదార్ధం గురించి చెప్పుకొచ్చారు. ‘రాగులు అంటే చిన్నప్పటినుంచి తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఈ ఆహారం తన కూతురు క్లీంకారకు కూడా అలవాటు చేశానని చెప్పారు. అలాగే రోజూ తన కుమార్తెకు రాగులను ఏదో ఒక రూపంలో తినిపించమని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ సందర్భంలో చెప్పారని తెలిపారు. ఆయన కూతురు రాధే జగ్గీ కూడా అదే విషయం చెప్పారని, అందుకే రాధే ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉందని చెప్పారు. ఇలా తన కూతురినికూడా హెల్దీగా, ఫిట్‌గా చూడాలనుకున్నానని, అందుకే తన రోజువారీ డైట్‌లో రాగుల్ని చేర్చానని చెప్పుకొచ్చారు ఉపాసన. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాగులు చిరుధాన్యాలు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు.. వంటి పోషకాలు నిండి ఉన్న ఈ పదార్థాన్ని చిన్నారులకు ఆరు నెలల వయసులో ఘనాహారం అలవాటు చేసినప్పట్నుంచీ అందించ వచ్చంటున్నారు నిపుణులు. అయితే తొలుత రాగి జావతో మొదలుపెట్టి.. వయసు పెరిగే కొద్దీ ఇతర పదార్థాలతో దీన్ని కలిపి హెల్దీగా పిల్లలకు తినిపించచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో 6-8 నెలల వయసున్న చిన్నారులకు రోజూ రెండు టేబుల్‌స్పూన్లు, 9-12 నెలల పిల్లలకు మూడు టేబుల్‌స్పూన్ల చొప్పున జావ తాగించాలి. రాగుల్ని చిన్నారుల డైట్‌లో భాగం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana Assembly: ఈనెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
గుడ్ న్యూస్.. త్వరలో భారత్‌లో ఓపెన్ ఏఐ తొలి ఆఫీస్
విమానంలో భార్యాభర్తల కొట్లాట.. దెబ్బకు షాక్!
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

