విమానంలో భార్యాభర్తల కొట్లాట.. దెబ్బకు షాక్!
భార్య భర్తలు అన్నాక కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి మితి మీరితే అనర్థాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ జంట చేసిన పనికి.. విమాన సిబ్బంది ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. ఇంట్లో గొడవ పడడం చాలదన్నట్లు.. విమానంలోనే గొడవ పెట్టుకున్న దంపతులకు విమాన సిబ్బంది ఆశ్చర్యపోయే షాక్ ఇచ్చింది.
భోపాల్ నుంచి పనిమీద హైదరాబాద్‌కు వచ్చిన సాక్షి, వందిత్ దంపతులు పని ముగించుకొని తిరిగి భోపాల్‌కు బయలుదేరారు. అందుకోసం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. దంపతులిద్దరూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానం ఎక్కారు. అంతే.. ఇంతలో ఏమైందో ఏమో భార్యభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ గొడవకు దిగారు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. అయినా వారు వినిపించుకోలేదు. విమానం స్టార్ట్ అయ్యేముందు కూడా వారు గొడవ ఆపలేదు. వీరి గొడవకు తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో పరిస్థితి అర్ధం చేసుకున్న విమాన సిబ్బంది వెంటనే ఆ దంపతులిద్దరినీ విమానం నుంచి దింపేసారు. అంతేకాదు, వారిని అక్కడే వదిలి విమానం టేకాఫ్ అయి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు దంపతుల గొడవకి విమాన సిబ్బంది ఇచ్చిన దెబ్బ అదుర్స్.. దంపతులకు షాక్ విమాన సిబ్బంది రాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వ్యతిరేక దిశలో ప్రవహించే నదిని చూసారా?
అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ
అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన
శభాష్ బేబీ.. ఇంటెలిజెంట్ అంటే నువ్వే! వీడియో చూసి కారు డోర్ ఓపెన్ చేసి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

