AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ

అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ

Phani CH
|

Updated on: Aug 26, 2025 | 12:03 PM

Share

గత కొద్ది రోజులుగా భార్యల చేతిలో భర్తలు దారుణ హత్యకు గురవుతున్న ఘటనలు వరుసగా చూస్తున్నాం. తాజాగా మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రియురాలు తన ప్రియుడిని సైబర్‌ ముఠాకు అమ్మేసింది. అవును, 17 ఏళ్ల బాలిక చైనాకు చెందిన 19 ఏళ్ల అబ్బాయిని మయన్మార్ లో పేరు మోసిన టెలికాం స్కామర్ల ముఠాకు అమ్మేసింది.

ఇందుకు గానూ ఆ అమ్మాయికి 10 వేల పౌండ్లు అంటే సుమారు 11 లక్షల రూపాయలు అందాయి. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని 17 ఏళ్ల ప్రియురాలు మోసం చేసింది. గత సంవత్సరం పరిచయమైన వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు పెద్ద వ్యాపారవేత్తలని మయన్మార్‌లో తన కుటుంబ వ్యాపారంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె నమ్మించింది. దీంతో నిజమే అని నమ్మి అతను తన కుటుంబానికి చెప్పకుండా బాలికతో కలిసి మయన్మార్‌ వెళ్లాడు. మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు యువకుడిని అప్పగించి ఆ బాలిక జారుకుంది. ముఠా ఆ యువకుడిని హింసించిందని షియావో షియాంగ్ మార్నింగ్‌ హెరాల్డ్‌ దినపత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. అక్కడ అతని ఫోన్, పాస్‌పోర్ట్ లాక్కున్నారు. కంప్యూటర్‌లో రోజంతా ప్రజలను మోసం చేసేలా అతన్ని బలవంతం చేశారు. అతన్ని ఒక చిన్న చీకటి గదికి తీసుకెళ్లి చెవులపై, తుంటిపై ఇనుప రాడ్లతో కొట్టారు. రోజుకు 16 నుంచి 20 గంటలు పని చేయమని బలవంతం చేశారు. రోజుల తరబడి ఆకలితో ఉంచారు. అతను బరువు తగ్గాడు అతని వినికిడి శక్తి కూడా తగ్గింది. మయన్మార్‌లోని చైనా చేంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సహాయంతో యువకుడిని అతని కుటుంబం విడిపించింది. ఇక 17 ఏళ్ల బాలిక చైనాకు తిరిగి రాగా పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. మన దేశంలో కోట్లలో మాయమవుతున్న సొమ్ము థాయ్‌లాండ్, లావోస్, మయన్మార్‌ లో తేలుతోంది. ఉద్యోగాల పేరుతో యువకుల్ని బంధించి సైబర్‌ నేరాలు చేయిస్తున్న ముఠాలకు కొత్త అడ్డాగా ఈ గోల్డెన్‌ ట్రయాంగిల్‌ అవతరించింది. గతంలో మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రబిందువుగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడు సైబర్‌ నేరస్థులకు స్వర్గధామంగా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన

శభాష్‌ బేబీ.. ఇంటెలిజెంట్‌ అంటే నువ్వే! వీడియో చూసి కారు డోర్‌ ఓపెన్‌ చేసి

6 నెలలకే పుట్టిన చిన్నారి.. బతికించిన హైదరాబాద్ వైద్యులు

పెళ్లిలో డాన్స్‌ చేస్తున్న వరుడు.. చెప్పుతీసిన వధువు.. ట్విస్ట్‌ అదిరిందిగా

కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర