AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యతిరేక దిశలో ప్రవహించే నదిని చూసారా?

వ్యతిరేక దిశలో ప్రవహించే నదిని చూసారా?

Phani CH
|

Updated on: Aug 26, 2025 | 12:26 PM

Share

సాధారణంగా సముద్రంలో అలలు ఎగసిపడటం చూస్తాం. నదులు సముద్రంలో కలిసిపోవడాన్ని కూడా చూసాం. కానీ, సముద్రం నుంచి వ్యతిరేక దిశలో ప్రవహించే నది, దానిలో ఎత్తైన అలలు ఎగసిపడటం మీరెప్పుడైనా చూశారా? వింతగా అనిపించినా చైనాలో ఇలాంటి అరుదైన సహజ దృశ్యం కనిపించింది. ఈ దృశ్యం నిజంగా షాక్‌కు గురిచేసింది.

సముద్రంలో వచ్చే అలలను చాలా మంది చూసి ఉంటారు. కానీ, నదులలో కూడా అలాంటి అలలు కనిపిస్తాయా.? అవును, ఈ రోజు మనం చైనాలోని అలాంటి ఒక నది గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ప్రమాదకరమైన అలలకు ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన ఘటనను టైడల్ బోర్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన నదులలో మాత్రమే కనిపిస్తుంది. చైనాలోని క్వియాంటాంగ్ నది కూడా అలాంటిదే. దీనిలో టైడల్ బోర్ ప్రపంచంలోనే అతి పెద్దది. సముద్రం నుండి వచ్చే అలలు అల రూపంలోకి వచ్చి నది లేదా ఇరుకైన బే లోకి ప్రవేశించినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ సమయంలో నది నీరు వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. టైడల్ బోర్ కొన్ని ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. అందుకు నది నిస్సారంగా ఉండాలి. సముద్రంలో దాని ముఖద్వారం ఇరుకైనదిగా ఉండాలి. బే ఆకారం గరాటులా ఉండాలి. అలాగే, అలల వ్యత్యాసం పెద్దదిగా ఉండాలి. ఇది సాధారణంగా 6 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. గరాటు లాంటి ఆకారం అలల పరిధిని పెంచుతుంది. వరద సమయాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఆటుపోట్లు నిర్ణీత సమయంలో వచ్చే చోట, టైడల్ బోర్లు అంతగా కనిపించవు. వాటి నిర్మాణం గాలి, నది లోతు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సీజన్‌ను బట్టి కూడా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టైడల్ బోర్ చైనాలోని కియాంటాంగ్ నదిపై సంభవిస్తుంది. ఇక్కడ టైడల్ అలలు 30 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. ఇక్కడి ఆటుపోట్లను లక్షల మంది తరలివస్తారు. అంతేకాదు దీన్ని ఒక పండుగ జరుపుకోవడం చైనీయులకే చెల్లింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ

అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన

శభాష్‌ బేబీ.. ఇంటెలిజెంట్‌ అంటే నువ్వే! వీడియో చూసి కారు డోర్‌ ఓపెన్‌ చేసి

6 నెలలకే పుట్టిన చిన్నారి.. బతికించిన హైదరాబాద్ వైద్యులు

పెళ్లిలో డాన్స్‌ చేస్తున్న వరుడు.. చెప్పుతీసిన వధువు.. ట్విస్ట్‌ అదిరిందిగా