AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి ప్రయాణికుడిని తోసేసిన RPF అధికారి

దారుణం.. రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి ప్రయాణికుడిని తోసేసిన RPF అధికారి

Phani CH
|

Updated on: Aug 26, 2025 | 12:36 PM

Share

రైల్లో కానీ, బస్సులో కానీ టికెట్‌ లేకుండా ప్రయాణించడం నేరం. ఇది అందరికీ తెలుసు. అయినా ఒక్కోసారి టికెట్‌ తీసుకునే అవకాశం లేక రైలు ఎక్కాక తీసుకుందామనో, మరో కారణంతోనో కొందరు టికెట్‌ లేకుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సమయంలో అధికారులు ఫైన్‌ వేస్తారు. ఫైన్‌ చెల్లించి టికెట్‌ తీసుకొని ప్రయాణం కొనసాగిస్తారు.

రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతను టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఓ ఆర్‌పీఎఫ్‌ అధికారి అతన్ని విచక్షణా రహితంగా రైలునుంచి బలవంతంగా తోసేసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రైన్‌లో యువకుడు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్టు ఆర్‌పీఎఫ్‌ అధికారి గుర్తించారు. అయితే ప్రయాణికుడికి జరిమానా విధించడం లేదంటే తదుపరి స్టేషన్‌లో అతన్ని రైలు నుంచి దించేయడం వంటివి చేయాలి. కానీ ఆ అధికారి అతన్ని చెంప దెబ్బలు కొడుతూ కదులుతున్న రైలు నుంచి బలవంతంగా బయటకు తోసేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. అదే ట్రైన్‌లో ఉన్న ఇతర ప్రయాణీకులు ఆ అధికారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైగా అడిగిన వారిపై కూడా ఆర్‌పీఎఫ్‌ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రయాణికుడు రహస్యంగా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై వేలాదిమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. టికెట్ లేకుండా ఆ యువకుడు ప్రయాణిస్తుంటే, అతనికి జరిమానా విధించాలి. లేదా నెక్ట్స్‌ స్టేషన్‌లో అతన్ని దించేయాలి. అంతేకానీ అతన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేయడం ఏంటి? అతను అధికారి అయితే మాత్రం అలా తోసేస్తారా? అంటూ ఓ యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు RPF అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీలోని RPF అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీడియోలో కనిపించిన కానిస్టేబుల్‌ను దయా బస్తీలోని RPF రిజర్వ్ లైన్‌కు తరలించామని, డివిజనల్ స్థాయి విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 18, 2025న ఢిల్లీ సారాయ్ రోహిల్లా స్టేషన్‌లో జరిగిందని తెలిపింది. ఆ యువకుడు రైలు అలారం గొలుసు లాగడంతో రైలు ఆగిపోయిందని, RPF అధికారికి సరైన గుర్తింపు వివరాలను అందించకపోవడంతో ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకుతోసే ప్రయత్నం చేశాడని RPF పేర్కొంది. ఆ టైమ్‌లో రైలు ప్లాట్‌ఫారమ్ వద్ద నిలబడి ఉందని, కదులుతున్న రైలు నుంచి ప్రయాణీకుడిని తోసివేశారనేది తప్పుడు ఆరోపణ అని స్పష్టం చేసింది. కారణం ఏదైనాగానీ అతడిపై అంత దురుసుగా ప్రవర్తించడం అన్యాయమని అంటున్నారు నెటిజన్లు. కాగా ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని RPF తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. త్వరలో భారత్‌లో ఓపెన్‌ ఏఐ తొలి ఆఫీస్‌

విమానంలో భార్యాభర్తల కొట్లాట.. దెబ్బకు షాక్!

వ్యతిరేక దిశలో ప్రవహించే నదిని చూసారా?

అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ

అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన