గుడ్ న్యూస్.. త్వరలో భారత్‌లో ఓపెన్ ఏఐ తొలి ఆఫీస్
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇటీవలే ‘చాట్‌జీపీటీ గో’ పేరుతో సరికొత్త, తక్కువ ధర గల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.399కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఓపెన్ ఏఐ టూల్స్‌కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో భారత వినియోగదారులకు తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తెచ్చింది.
ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన తొలి ఆఫీస్‌ను ఓపెన్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో చాట్ జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినట్లు తెలిపాయి. మరోవైపు, భారత్‌లో ఏఐకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. భారత్‌లో తొలి ఆఫీస్‌ను ప్రారంభించి స్థానిక టీమ్‌ను ఏర్పాటు చేయడం, ఆ మిషిన్‌కు కట్టుబడి భారత్‌లో కృత్రిమ మేధను మరింత అందుబాటులోకి తెస్తామన్న నిబద్ధతకు ఇది తొలి మొట్టు అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి భారత్‌లో ఓపెన్ ఏఐ ఆడుగుపెడుతుండటం పట్ల టెక్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో భార్యాభర్తల కొట్లాట.. దెబ్బకు షాక్!
వ్యతిరేక దిశలో ప్రవహించే నదిని చూసారా?
అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ
అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన
శభాష్ బేబీ.. ఇంటెలిజెంట్ అంటే నువ్వే! వీడియో చూసి కారు డోర్ ఓపెన్ చేసి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

