నేనే హీరోయిన్ అన్నా.. వెళ్లనివ్వండి వీడియో
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన సినిమా చూసేందుకు స్నేహితులతో కలిసి థియేటర్ కు వెళ్ళిన శ్రుతి హాసన్ కు చేదు అనుభవం ఎదురైంది. సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శాబిన్ షాహిర్, సత్యరాజ్ నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా కన్నడ నటి రచీత రాయ్ సహాయ నటి పాత్ర పోషించింది.
చెన్నైలో శ్రుతి థియేటర్ లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ ఆమెను ఆపేశాడు. రిలీజ్ డే రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రుతి కారులో చిత్రీకరించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. ఇందులో శ్రుతి తన స్నేహితులతో ప్రయాణిస్తున్నారు. సెక్యూరిటీ తమ కారును అడ్డుకోవడంతో శ్రుతి స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. కూలీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు స్నేహితులతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్ కు వెళ్ళింది శ్రుతి హాసన్. అక్కడ ఆమెను గుర్తుపట్టని సెక్యూరిటీ గార్డ్ శ్రుతి కారును అడ్డుకున్నాడు. లోపలికి వెళ్ళకుండా బయటే నిలిపేశాడు. శ్రుతి స్పందిస్తూ తాను ఈ సినిమాలో ఉన్నానని తనని లోపలికి అనుమతించాలని రిక్వెస్ట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఊహించని అనుభవం శ్రుతిని ఆశ్చర్యానికి లోన చేసింది. ఆ తర్వాత కారులో ఉన్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోపై థియేటర్ యాజమాన్యం స్పందించింది. థియేటర్ సెక్యూరిటీ తన డ్యూటీని కాస్త ఓవర్ గా చేశాడని ఆ క్షణాన్ని నవ్వుతూ ఎంజాయ్ చేసినందుకు థాంక్స్ అంటూ వీడియోకి రిప్లై ఇచ్చిన తీరు ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోల కోసం
భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!
ప్రాణం తీసిన కోడిగుడ్డు.. నోట్లో పెట్టుకోగానే వీడియో
శ్రీశైలం సమీపంలో దారుణం.. నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లిన చిరుత..
వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

