వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి..
మాములుగా చిన్న పామును చూస్తేనే ఎవరైనా సరే.. భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా.. భారీ నాగుపాము కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైనే పోతాయి. అదీ ఊహించని టైంలో ఇలాంటి సీన్స్ ఎదురైతే.. ఎవరి పరిస్థితైనా తలకిందులు కాకామనదు. కేరళలో ఓ ఇంటిలోని మహిళలు అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు.
కన్నూరు జిల్లా వాణియప్పంలో ఓ ఇంటి వంటగదిలో మూలన కనిపించిన కింగ్ కోబ్రాను చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వంటగది మూలన చుట్టుకుని కదలకుండా ఉన్న ఆ భారీ పామును చూసి భయపడిన వారు వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. ఫైసల్ విలక్కోడ్, మిరాజ్ పేరావూర్, అజిల్‌కుమార్, సాజిద్, ఆరణం అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పామును పట్టుకుని, సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. వారం రోజుల వ్యవధిలో కన్నూరులో కింగ్ కోబ్రాలు హల్ చల్ చేయడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం తుడిమర టౌన్ సమీపంలోని ఒక భవనంలో దొరికిన భారీ పామును కూడా ఇదే బృందం పట్టుకుని అడవిలో వదిలింది. ఇక రెండు రోజుల క్రితం వడక్కంచేరి పూతనక్కయం ప్రాంతంలోనూ ఓ కింగ్ కొబ్రాను రెస్క్యూ చేశారు. ఓ వ్యక్తి స్థలానికి ఆనుకుని ఉన్న వాగులో కార్మికులు పనిలో ఉన్నప్పుడు పామును గమనించి, వెంటనే అటవీశాఖవారికి సమాచారం ఇచ్చారు. అధికారులు చేరుకుని పామును పట్టుకుని అడవిలో వదిలారు.
మరిన్ని వీడియోల కోసం :
కాపాడాలంటూ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్.. తర్వాత అంతా షాక్ వీడియో
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న జింకలు.. వీడియో చూసారా ?వీడియో
ఏసీ కోచ్‌లో తగ్గిన కూలింగ్ ..ఏంటా అని చూడగా షాక్ వీడియో
ఆ పని కోసం..రూ. కోటి వేతనం వదులుకున్నాడు వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
