భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!
లవ్, ఫ్రెండ్‌షిప్, భార్యభర్తలు, కుటుంబ సంబంధాలు వంటి వాటిల్లో అపార్థాలు, కోపాలు సహజం. మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు, వారిని శాంతపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు మరింత దూరం పెంచవచ్చు. ఈ క్రమంలో కొన్ని రకాలు పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తొమ్మిది పొరపాట్లు అసలు చేయొద్దంటూ సూచిస్తున్నారు.
మీ భాగస్వామి కోపం వెనుక ఒక కారణం ఉంటుంది. వారి బాధను లేదా కోపాన్ని ‘ఇంత చిన్న విషయానికేనా?’ అని కొట్టిపారేయకుండా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు కోపంగా ఉన్నప్పుడు వారితో వాదించడం మరింత కోపాన్ని పెంచుతుంది. ఆ సమయంలో మౌనంగా ఉండి, వారు శాంతించిన తర్వాత మాట్లాడటం మంచిది. పాత గొడవలను మళ్లీ గుర్తు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత ఉద్రిక్తతకు దారి తీస్తుంది గనుక..అప్పటి సమస్య మీదనే మాట్లాడుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.ఇక.. మీ భాగస్వామిని ఇతరులతో అస్సలు పోల్చవద్దని, అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ భాగస్వామి బాధలో ఉన్నప్పుడు..ఇవతలి వ్యక్తి..బాధితుడిగా వ్యవహరించడం వల్ల వారికి మరింత కోపం వస్తుంది. అలాగే,భాగస్వామి ఒంటరిగా ఉండాలని కోరుకున్నప్పుడు, బలవంతంగా వారితో ఉండటానికి బదులు వారికి కొంత టైం ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. మీ వలన జరిగిన తప్పును ఒప్పుకొని, సారీ చెప్పటం మంచిదని.. అలా కాకుండా అహంకారంతో ‘సరేలే, క్షమించు’ అని డిమాండ్ చేయటం వద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇక..వారు కోపంగా మాట్లాడటం మానేస్తే.. కొంత టైం తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప.. మీరు కూడా పంతానికి పోయి మౌనంగా ఉంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. ప్రతి బంధంలోనూ ప్రేమ, అవగాహన, సహనం చాలా ముఖ్యమని సైక్రియాటిక్ నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కాపాడాలంటూ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్.. తర్వాత అంతా షాక్ వీడియో
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న జింకలు.. వీడియో చూసారా ?వీడియో
ఏసీ కోచ్‌లో తగ్గిన కూలింగ్ ..ఏంటా అని చూడగా షాక్ వీడియో
ఆ పని కోసం..రూ. కోటి వేతనం వదులుకున్నాడు వీడియో
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
