Satyadev: విశ్వక్ సేన్ హీరోగా చేసిన ఆ సూపర్ హిట్ సినిమా సత్యదేవ్ చేయాల్సిందా? రాత్రికి రాత్రే…
సత్యదేవ్.. విశ్వక్ సేన్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదుగుతోన్న హీరోల్లో వీరు కూడా ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నారీ ట్యాలెంటెడ్ హీరోలు. అయితే తాజాగా ఈ హీరోల గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఇక్కడ పలు కారణాలతో ఒకరి ఛాన్స్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేస్తూ ఉంటాడు. కొన్ని సార్లు వేరే హీరోల నుంచి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వొచ్చు. ఇంకోసారి ప్లాఫ్ కూడా అవ్చొచ్చు. అలా సత్యదేవ్ ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యాడట. ఇటీవల కింగ్ డమ్, అరేబియా కడలి సిరీస్ లతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడీ ట్యాలెంటెడ్ హీరో. కింగ్ డమ్ సినిమాకు సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అరేబియా కడలి సిరీస్ తోనూ మరో హిట్ కొట్టాడు సత్యదేవ్. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సత్యదేవ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన హిట్ 1.. ది ఫస్ట్ కేస్ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను అమితంగ ఆకట్టుకుంది. పోలీసాఫీసర్ గా విశ్వక్ సేన్ యాక్టింగ్ అదరగొట్టాడు. అయితే ఈ హిట్ 1 సినిమాను మొదట సత్యదేవ్ తో చేద్దాం అనుకున్నాడట శైలేష్ కొలను. అలా రాత్రి అనుకోని నెక్స్ట్ డే మార్నింగ్ సత్యదేవ్ కి కథ చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నాడట. అయితే ఆ రోజు రాత్రే సత్యదేవ్ చేసిన ఓ సినిమా ట్రైలర్ చూశాడట డైరెక్టర్ శైలేష్ కొలను. ఆ ట్రైలర్ లో సత్యదేవ్ పోలీస్ గా కనిపించాడట. దీంతో బ్యాక్ టు బ్యాక్ పోలీస్ అయితే తన సినిమా పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదని శైలేష్ భావించాడట. దీంతో సత్యదేవ్ ని వద్దనుకున్నాడట. ఆ తర్వాత ఇదే కథతో విశ్వక్ సేన్ వద్దకు వెళ్లడం, అతను వెంటనే ఒకే చెప్పడం చకా చకా జరిగిపోయాయట.
ఇక్కడ దురదృష్టకరమైన విషయమేమిటంటే.. డైరెక్టర్ శైలేష్ కొలను ఏదైతే ట్రైలర్ లో సత్యదేవ్ ని పోలీస్ గా చూసి వద్దనుకున్నాడో ఆ సినిమా ఇంకా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదట.
అరేబియా కడలి సిరీస్ లో సత్యదేవ్..
Between “cut” and “action” lies the real madness.
It was super fun shooting with these wonderful humans for #arabiakadali.
It’s streaming now on @PrimeVideoIN @FirstFrame_Ent pic.twitter.com/X7r3Svsq5P
— Satya Dev (@ActorSatyaDev) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








