AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు! భర్త చనిపోయిన బాధలో ఉంటే ఇదేంటి?

బిగ్ బాస్ సీజన్ మళ్లీ షురూ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ.. ఇలా ప్రముఖ భాషలన్నింటిలోనూ ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి హౌస్ లోకి పహల్గామ్ దాడి బాధితురాలు రావొచ్చన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

Bigg Boss: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు! భర్త చనిపోయిన బాధలో ఉంటే ఇదేంటి?
Bigg Boss TV Show
Basha Shek
|

Updated on: Aug 12, 2025 | 6:06 PM

Share

కొన్నాళ్ల క్రితం కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలచి వేసింది. ముష్కరులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో సుమారు 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో హనీమూన్ కోసం అక్కడికి వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ దుర్ఝటన తర్వాత సంఘటన స్థలంలోనే వినయ్ మృతదేహం పక్కనే అతని భార్య భార్య హిమాన్షి నర్వాల్ రోధిస్తోన్న ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆమెకు చాలామంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడామె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం బిగ్‌బాస్ రియాలిటీ షో. ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్‌బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోది. అయితే ఈ సారి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు హౌస్ లోకి అడుగు పెడతారన్న విషయమై కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఉగ్రదాడిలో భర్త చనిపోయి ఎన్ని రోజులు కాలేదు అలాంటిది ఆమె షోలో పాల్గొంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఎప్పటి లాగే ఈసారి కూడా బిగ్‌బాస్ షో నిర్వాహకులు.. ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేసే కంటెస్టెంట్స్‌ని హౌస్ లోకి తీసుకు రావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌కు ఒకప్పుడు కాలేజీలో స్నేహితురాలు. ఈ కారణంతోనే ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకు రాబోతున్నట్టు వినిపిస్తోంది.  అయితే ఇందులో నిజం లేదని కొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం అని.. అసలు బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించలేదని, ఈ రియాలిటీ షోలో ఆమె పాల్గొనే అవకాశమే లేదని నెటిజన్లు కొట్టి పారేస్తున్నారు.

హిమాన్షి విషయానికి వస్తే.. ఈమె కథ వెనుక విషాదం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. తన భర్తతో కలిసి హనీ మూన్ కోసం పహల్గామ్ కు వెళ్లింది హిమాన్షీ. అయితే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఆమె భర్త వినయ్ నర్వాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  హిమాన్షి మాత్రం క్షేమంగా బయటపడ్డారు. కానీ ఘటనా స్థలంలో భర్త మృత దేహం పక్కన హిమాన్షీ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే యావత్ దేశం కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..