AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT MOVIE: అమ్మాయిల్ని చంపేసి ఫ్రీజర్‌లో దాచేసే సైకో కిల్లర్.. ఓటీటీలో మోస్ట్ వయలెంట్ మూవీ.. పిల్లలతో చూడొద్దు

ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సైకో కిల్లర్ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కొన్ని సార్లు ఈ సినిమాలు కానీ, సన్నివేశాలు కానీ తీవ్ర వివాదాస్పదమవుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT MOVIE: అమ్మాయిల్ని చంపేసి ఫ్రీజర్‌లో దాచేసే సైకో కిల్లర్.. ఓటీటీలో మోస్ట్ వయలెంట్ మూవీ.. పిల్లలతో చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 11, 2025 | 5:41 PM

Share

ఓటీటీలో దిమాక్ ఖరాబ్ చేసే సినిమాలు చాలా ఉంటాయి. అంటే వీటిలో హింసాత్మక సన్నివేశాలు, అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలను పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా మోస్ట్ కాంట్రవర్సియల్ మూవీ. ఎందుకంటే ఇందులో హింసాత్మక సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ కథ 1970-80 దశకంలో వాషింగ్టన్ స్టేట్‌లో జరుగుతుంది. జాక్ ఒక ఫెయిల్యూర్ ఆర్కిటెక్ట్. అయితే ఇది గుర్తు చేసిన వారందరినీ దారుణంగా హత మారుస్తూ సైకో కిల్లర్ గా మారిపోతాడు. తనను ఎగతాళి చేసిన అమ్మాయిలను క్రూరంగా చంపేసి వారి డెడ్ బాడీస్ ను ఫ్రీజర్ లో దాచి పెడతాడు. ఇలా అమ్మాయిలందరి శరీరాలతో తన డ్రీమ్ హౌస్ ను బిల్డ్ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతాడు. మరి అతని కల నెరవేరిందా ? జాక్ ఎందుకిలా అందరినీ చంపుతున్నాడు? పోలీసులు ఈ సైకో కిల్లర్ ను పట్టుకున్నారా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ పేరు ‘ది హౌస్ దట్ జాక్ బిల్ట్( The House That Jack Built). లార్స్ వాన్ ట్రియర్ తెరెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మాట్ డిల్లాన్ , బ్రూనో గాంజ్ , ఉమా థుర్మాన్ , సియోభాన్ ఫాలన్ హోగన్ , సోఫీ గ్రాబోల్ తదితరుల ప్రధాన పాత్రలు పోషించారు. జెంట్రోపా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రీమియర్ అయింది. అంతేకాదు 2018లో కాహియర్స్ డు సినిమా ద్వారా 8వ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కానీ ఇందులోని సన్నివేశాలు మాత్రం పలు వివాదాలకు దారి తీశాయి. ముఖ్యంగా సైకో కిల్లర్ అత్యంత పాశవికంగా అమ్మాయిలను హతమార్చే సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

పిల్లలతో  కలిసి చూడకండి..

‘ది హౌస్ దట్ జాక్ బిల్ట్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వీడియోలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. అలాగే హులు, MUBIలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్. అయితే చిన్న పిల్లలతో మాత్రం కలిసి అసలు చూడకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..