AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మొదటి రోజే 9000 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ..

హాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ సినిమాల్లో జురాసిక్ పార్క్ ఒకటి. మన దేశంలోనూ డైనోసార్ల సినిమాలకు ఛాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే జురాసిక్ సిరీస్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించాయి.

OTT Movie: మొదటి రోజే 9000 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ..
Jurassic World Rebirth Movi
Basha Shek
|

Updated on: Aug 05, 2025 | 7:08 PM

Share

డైనోసార్ల నేపథ్యంలో తెరకెక్కిన జురాసిక్ పార్క్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మనదేశంలోనూ చాలా మంది ఈ సిరీస్ సినిమాలను ఎగబడి చూస్తారు. జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. మన దేశంలోనూ రిలీజై రికార్డు కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడిదే సిరీస్ లో తెరకెక్కిన మరో చిత్రం జురాసిక్ వరల్డ్ రీ బర్త్. 2022లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌’కు సీక్వెల్‌గా దీనిని తెరకెక్కించారు. జులై 2న వచ్చిన ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. గతంలో వచ్చిన సినిమాల్లా కాకపోయినా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలోనూ ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. అయితే ఇప్పుడీ జురాసిక్ పార్క్ మూవీ నెల రోజులయ్యే సరికే సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం వీడియో ఆన్ డిమాండ్(అద్దె విధానంలో) మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి గరేత్ ఎడ్వెర్డ్స్ దర్శకత్వం వహించగా… డేవిడ్ కోప్ కథ అందించారు. స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించగా… ఆడ్రినా మిరాండా, ఎడ్ స్క్రెయిన్, జొనాథన్ బెయిలీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ హాలీవుడ్ మూవీ సుమారుగా 70 దేశాల్లో విడుదలయ్యింది. ఇండియాతో పాటు చైనా, కొరియా, ఆస్ట్రేలియా, యూకే, నార్త్ అమెరికా, మెక్సికో, గల్ఫ్, సింగపూర్, మలేషియా, ఇటలీ, ఐర్లాండ్, స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాల్లో భారీగా రిలీజ్ చేశారు. దీంతో మొదటి రోజే ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా 105 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 9000 కోట్ల రూపాయలను ఈ మూవీ వసూలు చేసింది అని డెడ్‌లైన్ వెబ్‌సైట్ తెలిపింది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

డిలీటెడ్ సీన్లతో కలిపి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .