AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైంది. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసింది. కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని విజువల్స్, ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంతకీ ఈ మూవీ ఏంటో తెలుసా.. ?

Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
Kantara Movie
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2025 | 5:38 PM

Share

కంటెంట్ బలంగా ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది. ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలోకి డబ్ అయ్యింది. ఫలతింగా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాలోని శక్తివంతమైన విజువల్స్.. క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? 2022లో విడుదలైన కాంతార: ది లెజెండ్.

ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..

కన్నడలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో పోషించాడు. అలాగే ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. కర్ణాటకలోని ఒక తీరప్రాంత గ్రామంలో జరిగిన ఈ కథ మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణ, సంప్రదాయం.. ఆధునిక దురాశను చూపిస్తుంది. స్థానిక జానపద కథలు, ఆచారాలు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో పూజించబడే భూత కోల అనే పురాతన సంప్రదాయాన్ని అందంగా వెండితెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ హైలెట్. అలాగే మ్యూజిక్ సైతం మరో ప్రధాన బలం.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇందులో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు ప్రాణం పోశారు. అలాగే సినిమాటోగ్రఫీ, బీజీఎం మరో హైలెట్. ఈ సినిమా భారతీయ సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలోనే కాకుండా అటు ఓటీటీల్లోనూ ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..

ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us
కాలేజీ విద్యార్థుల కోసం గూగుల్ AI ప్లస్ సూపర్​ ప్లాన్
కాలేజీ విద్యార్థుల కోసం గూగుల్ AI ప్లస్ సూపర్​ ప్లాన్
నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేక మొబిలిటీ వెహికల్.. పూర్తి వివరాలివే
నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేక మొబిలిటీ వెహికల్.. పూర్తి వివరాలివే
భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..!
భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..!
పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?
పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?
హువావే నుంచి మొదటి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ ఫోన్​
హువావే నుంచి మొదటి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ ఫోన్​
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తున్నారా..? భారీగా నష్టం..
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తున్నారా..? భారీగా నష్టం..
ప్రతి నెలా రూ. 5000 ఇన్వెస్ట్‌తో పదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయి?
ప్రతి నెలా రూ. 5000 ఇన్వెస్ట్‌తో పదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయి?
ఉదయాన్నే ఇలా కొబ్బరి నూనె తాగి చూడండి..నడుము చుట్టూ కొవ్వు తగ్గి
ఉదయాన్నే ఇలా కొబ్బరి నూనె తాగి చూడండి..నడుము చుట్టూ కొవ్వు తగ్గి
ఐఫోన్ డిజైన్‌తో తలపడేలా షావోమి హైపర్‌ఓఎస్ 4 అప్‌డేట్.. వివరాలివే
ఐఫోన్ డిజైన్‌తో తలపడేలా షావోమి హైపర్‌ఓఎస్ 4 అప్‌డేట్.. వివరాలివే
యశస్వి జైస్వాల్‌పై 5 టెస్టుల నిషేధం పడనుందా..?
యశస్వి జైస్వాల్‌పై 5 టెస్టుల నిషేధం పడనుందా..?