- Telugu News Photo Gallery Cinema photos Do you Know Mahesh Babu Best Friend In Tollywood, She Is Trisha, Both Are in College Friends Before Movies
Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. అయితే ఇండస్ట్రీలో మహేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ? వీరిద్దరి కాంబోలోనూ సినిమాలు వచ్చాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
Updated on: Aug 03, 2025 | 1:47 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి తెలిసిందే. కృష్ణ నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు.

చివరగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్నారు జక్కన్న. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. ఈరోజు (ఆగస్ట్ 3)న ఫ్రెండ్షిప్ డే. ఈ సందర్భంగా సినీతారల స్నేహం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. మహేష్ బాబు కాలేజీ ఫ్రెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఇద్దరి కాంబోలో సినిమాలు కూడా వచ్చాయి.

కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదండి.. హీరోయిన్ త్రిష. వీరిద్దరు కలిసి చెన్నైలో కాలేజీ ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గతంలో త్రిష బయటపెట్టింది. ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారని.. దీంతో మహేష్ బాబుతో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో ఇద్దరం యాక్టర్స్ అవుతామని అసలు అనుకోలేదని తెలిపింది. ప్రస్తుతం త్రిషకు ఇండస్ట్రీలో ఫేవరేట్ హీరో అంటే మహేష్ బాబు అని తెలిపింది. వీరిద్దరు కలిసి అతడు, సైనికుడు కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.




