- Telugu News Photo Gallery Cinema photos Sukumar Daughter Sukriti Veni National Award Winning Celebrations Photos Go Viral
71st National Film Awards: కూతురికి జాతీయ అవార్డు.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న సుకుమార్ ఫ్యామిలీ.. ఫొటోస్ వైరల్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికైంది. దీంతో సుకుమార్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తాజాగా ఫ్యామిలీతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు
Updated on: Aug 03, 2025 | 9:14 PM

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ఇటీవలే ప్రకటించింది. ఇందులో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మొత్తం ఏడు పురస్కారాలు దక్కాయి.

ఈ అవార్డుల్లో భాగంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ పురస్కారానికి ఎంపికైంది. గాంధీ తాత చెట్టు సినిమాకు గాను సుకృతి వేణికి ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లభించింది.

ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 03) సుకుమార్ ఇంట్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో సుకృతి తండ్రి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, తల్లి బబితా సుకుమార్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు సుకుమార్ కుటుంబ సభ్యులు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక గాంధీ తాత చెట్టు సినిమా విషయానికి వస్తే.. మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు

ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమారి కూతురు యాక్టింగ్ చూడాలనుకునేవారు ఈ మూవీపై ఓ లుక్కేసుకోవచ్చు.




