AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalaivasal Vijay: ఈ నటుడి ఇద్దరు అల్లుళ్లు తోపు క్రికెటర్స్.. IPLలో సత్తా చాటిన ప్లేయర్స్.. ఎవరంటే..

ఫోటోలో కనిపిస్తున్న నటుడు సినీప్రియులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఫేమస్ అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. నిజానికి ఆయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Thalaivasal Vijay: ఈ నటుడి ఇద్దరు అల్లుళ్లు తోపు క్రికెటర్స్.. IPLలో సత్తా చాటిన ప్లేయర్స్.. ఎవరంటే..
Thalaivasal Vijay
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2025 | 2:50 PM

Share

తలైవాసల్ విజయ్.. ఈ పేరు చెబితే సినీప్రియులు అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. 90వ దశకంలో పవర్ ఫుల్ పాత్రలతో జనాలకు దగ్గరయ్యారు. 1992లో విడుదలైన తలైవాసల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. దీంతో తన ఫస్ట్ మూవీ పేరునే ఇంటిపేరుగా మార్చుకుని తలైవాసల్ విజయ్ గా మారారు. ఆ తర్వాత తమిళంలో ఆయనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రతి ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా హీరోగానూ అలరించారు. 1995లో వచ్చిన స్త్రీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో కథానాయకుడిగా కనిపించారు. ఆ తర్వాత నాయకుడు, కేక, మరో చరిత్ర ఇలా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. నాగార్జున నటించిన గగనం సినిమాతో ఆయనకు తెలుగులో బ్రేక్ వచ్చింది. తెలుగులో భాగమతి, యాత్ర, రాధేశ్యామ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాల్లో కనిపించారు.

ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయితే విజయ్ కు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు జయవీణ స్విమ్మర్. నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన దక్షిణాసియా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె గెలిచింది. ఇండియాలో అత్యంత వేగవంతమైన స్విమ్మర్ టైటిల్ సైతం సొంతం చేసుకుంది. ఇక ఆమె భర్త బాబా అపరాజిత్ తమిళనాడు క్రికెట్ జట్టుకు మెయిన్ ప్లేయర్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఐదు సీజన్లలో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. ఇక అతడి తమ్ముడు బాబా ఇంద్రజిత్ సైతం క్రికెటర్ కావడం విశేషం. 2022లో ఇండియన్ ప్రీమియర్ లీక్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో అతడిని కోల్ కత్తా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా కొనుగోలు చేసింది.

Thalaivasal Vijay Family

Thalaivasal Vijay Family

ఇవి కూడా చదవండి.. 

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..