- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress in This Photo, She Is Meera Jasmine Photos Goes Viral
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్లో అందాల రచ్చ..
సినీరంగంలో అందం, అభినయంతో మెప్పించిన ఓ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అప్పట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు..ఇప్పుడు గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?
Updated on: Jul 27, 2025 | 12:44 PM

ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా మంది సీనియర్ కథానాయికలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మెప్పిస్తున్నారు. పైన కనిపిస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఆమె చాలా మంది ఫెవరెట్.

తెలుగుతోపాటు తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు. అప్పట్లో గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇప్పుడు అందాలతో అదరగొడుతుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీరా జాస్మిన్.

ఒకప్పుడు తెలుగులో ఆమెకు భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు రవితేజ జోడిగా భద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

తెలుగులో వరుస సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. అప్పట్లో సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షోకు నో చెప్పిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాలతో మెంటలెక్కిస్తోంది.

చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా జాస్మిన్ విమానం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.




