Kingdom Box Office Collections Day 1: బాక్సాఫీస్ వద్ద విజయ్ క్రేజ్.. కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా కింగ్డమ్. జూలై 31న విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తుంది.

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న ఈ మూవీకి ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని సమాచారం. ఈ సినిమాకు ఫస్ట్ రోజే 50 శాతం ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం మొదటి రోజు కింగ్డమ్ సినిమా దాదాపు రూ.30కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
అంటే కింగ్డమ్ మొదటి రోజు రూ.15.75 కోట్ల షేర్స్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరిర్ లో అత్యంత విజయవంతమైన ప్రారంభరోజు ప్రదర్శనలలో ఇది ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే దాదాపు రూ.18 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. ఇక అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయి. ఇక ఇప్పుడు భారతదేశంలో కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
ఇక కింగ్డమ్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 57.87 % ఆక్యుపెన్సీ రాగా.. ఉదయం 63.56% హాజరు వచ్చింది, ఇది మధ్యాహ్నం 56.52%, సాయంత్రం 50.12%కి, రాత్రి ప్రదర్శనలకు మళ్ళీ 61.27%కి వచ్చింది. జెర్సీ సినిమాతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సే, సత్య దేవ్, అయ్యప్ప పి. శర్మ కీలకపాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
The Roar of Happiness ❤️🔥#Kingdom fills every heart with an emotion that stays for a long time 💥
With solid word of mouth, #BoxOfficeBlockbusterKingdom has become the verdict delivered by the audience 😎@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/hEfNVbje1O
— Sithara Entertainments (@SitharaEnts) July 31, 2025
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..








