OTT Cinema: ఫైట్స్ లేవు.. గ్లామర్ సాంగ్స్ లేవు.. అయినా ఓటీటీలో దుమ్మురేపుతున్న చిత్రాలు ఇవే.. ఫ్యామిలీతో కలిసి..
ఓటీటీలో ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల గురించి మీకు తెలుసా.. ? ఎలాంటి యాక్షన్ హడావిడి, ఫైట్స్ లేకుండా.. గ్లామర్ సాంగ్స్ ఊసే లేకుండా ఉన్న చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇంతకీ ఏఏ సినిమాలు ఉన్నాయో తెలుసా.. ?

ఇప్పుడు ఓటీటీలో చాలా కంటెంట్ సినీప్రియులను అలరిస్తుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలి.. ఎలా ప్రారంభించాలి అనేది సమస్య. ఎందుకంటే ఓటీటీలో ఈమధ్య కాలంలో కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువగా రావడంతో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కుటుంబంతో కలిసి మీరు చూసేందుకు వీలైన సినిమాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న 5 టాప్-మోస్ట్ వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం. ఆకట్టుకునే కథలు, భావోద్వేగాలు, కామెడీతో నిండి ఉన్న వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి.
తాజ్ మహల్ 1989
ప్రేమ, సంబంధాలు, విలువల గురించి చూపించే క్లీన్ సినిమా తాజ్ మహల్. ఇందులో నీరజ్ కబీ, గీతాంజలి కులకర్ణి, షీబా చద్దా, డానిష్ హుస్సేన్ నటించారు. ఇది 1989లో భారతదేశంలోని లక్నో ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా 2020లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మాలా లీగల్ హై..
రవికిషన్ కీలకపాత్రలో నటించిన సిరీస్ మాలా లీగల్ హై. ఇది ఒక కామెడీ సిరీస్. రాహుల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో రవి కిషన్‌తో పాటు అనంత్ వి జోషి, నిధి బిష్ట్, నైలా గ్రేవాల్, తన్వి అజ్మీ నటించారు. కోర్టు నేపథ్యంలో సాగే కథ ఇది. 2024 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. త్వరలోనే సీజన్ 2 రానుంది.
కోటా ఫ్యాక్టరీ..
కామెడీ వెబ్ సిరీస్ అంటే ఇష్టమైనవారికి ఇది సరైన ఎంపిక. TVF నిర్మించిన ఈ సిరీస్ కు రాఘవ్ సుబు, ప్రతీష్ మెహతా దర్శకత్వం వహించారు. ఇందులో మయూర్ మోర్, జితేంద్ర కుమార్, రంజన్ రాయ్, ఆలం ఖాన్, ఎహ్సాస్ చన్నా నటించారు. IIT-JEE కోసం సిద్ధం కావడానికి కోటకు వచ్చే విద్యార్థుల ఆధారంగా రూపొందించబడింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
సెలక్షన్ డే..
సెలక్షన్ డే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్. 2018లో విడుదలైన ఈ సిరీస్ లో రాజేష్ తైలాంగ్, కర్వీర్ మల్హోత్రా, మహేష్ మంజ్రేకర్, రత్న పాఠక్ నటించారు. అరవింద్ అడిగా నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఇద్దరు అన్నదమ్ముల కథను చూపించారు. తండ్రికి తెలియకుండా భారత క్రికెట్ జట్టులోకి వెళ్లాలనుకునే ఇద్దరు యువకుల కథ.
మై: ఎ మందర్ రేజ్
ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్. ఇందులో ఒక తల్లి కథను చూపించారు. 2022 సంవత్సరంలో విడుదలైన మై: ఎ మందర్ రేజ్, అన్షాయ్ లాల్ దర్శకత్వం వహించిన చాలా అందమైన చిత్రం. అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మ నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ నిర్మించారు. మైలో సాక్షి తన్వర్ ప్రధాన పాత్రలో నటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి..
ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..








