Cinema: వార్నీ.. సినిమా చూసి తెగ ఏడుస్తున్న జనాలు.. ఇంతకీ ఈ సైయారా మూవీ కథేందీ..
స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. పెద్దగా ప్రచారం లేదు.. కానీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది ఈ సినిమా. జూలై 18న విడుదల కాగా ఇప్పటివరకు రూ.120 కోట్లు రాబట్టింది. మరోవైపు ఈ సినిమా చూస్తూ అడియన్స్ ఇస్తున్న రియాక్షన్స్ మాత్రం మాములుగా లేవు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఓ సినిమా పేరు మారుమోగుతుంది. ఆ మూవీ చూస్తూ థియేటర్లలో జనాలు చేస్తున్న నాటకాలు, హడావిడి మాములుగా లేదు. గుండెలు బాదుకుంటూ తెగ ఏడుస్తున్నారు.. స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ సినిమాకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. సినిమా నచ్చి కొందరు థియటేర్లకు వెళ్తుంటే.. అసలు ఈ మూవీ కథేందీ అంటూ మరికొందరు వెళ్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది ఈ మూవీ. పెద్దగా ప్రచారం చేయకపోయినా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జూలై 18న విడుదలై ప్రస్తుతం థియేటర్లలో భారీ రస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటీ.. ? అసలు ఈ మూవీలో ఏముందో తెలుసుకుందామా.
పెద్ద హీరోహీరోయిన్స్ లేరు…అగ్ర దర్శకుడు కాదు.. అలాగే భారీగా ఫైట్స్ లేవు.. అంతకు మించిన డైలాగ్స్ లేవు.. ఇక భారీ బడ్జెట్.. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్ అసలే లేదు..అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది ఈ మూవీ. అందుకు ఒకే ఒక్క రీజన్ ఎమోషన్. ప్రేక్షకుల హృదయాలను తాకే ఎమోషన్. అయితే ఇప్పటివరకు భారతీయ సినిమా ప్రపంచంలో అంతకుమించిన ఎమోషనల్ ప్రేమకథలు… అద్భుతమైన లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. ఈ సినిమా వాటికి మించిన స్టోరీ అయితే కాదు.. సంగీతమంటే ప్రాణమున్న ఓ యువకుడు ఎలాగైనా మ్యూజిక్ కంపోజర్ కావాలనుకుంటాడు. అతడిని ఒకసారి చూసిన జర్నలిస్టు.. లిరిసిస్ట్ అమ్మాయి ఇష్టపడుతుంది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది.
ఇద్దరూ సంతోషంగా ఉంటున్న సమయంలోనే వాణీ బాత్రా (కథానాయిక)ను ప్రేమ పేరుతో గతంలో మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. అప్పటికే మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ? ఆ వ్యక్తి రాకతో వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితి తలెత్తుతాయి.. ? చివరకు వాణీ బాత్రా ఎవరిని వివాహం చేసుకుంటుంది అనేది సినిమా. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో యాక్టర్స్ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇదొక ఫీల్ గుడ్ స్టోరీ.
ఓవైపు ఈ సినిమా చూస్తూ యూత్ తెగ ఏడుస్తున్నారు. స్పృహతప్పి పడిపోతున్నారు. సినిమా బాగుందంటూ ఆకాశానికి ఏత్తేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ అచ్చం ఆషికీ 2 సినిమాలా ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒకరే కావడం గమనార్హం. అతడే మోహిత్ సూరి. మొత్తానికి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సైయారా మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.
View this post on Instagram
View this post on Instagram
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








