OTT Movie: ఏం సినిమా రా బాబూ.. దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. క్లైమాక్స్ అస్సలు ఊహించలేం..
ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. నిత్యం కొత్త కొత్త జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ కోసం సరికొత్త కంటెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తీసుకువచ్చాం. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ఈ సినిమా మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది.

సాధారణ స్టోరీ.. కానీ నెమ్మదిగా మిమ్మల్ని మానసిక చిక్కైన ప్రదేశంలోకి తీసుకెళ్తుంది. రెగ్యులర్ గా సాగుతున్న స్టోరీ అయినప్పటికీ అర్థంకాని ట్విస్టులతో సాగుతుంటుంది. 2025లో విడుదలైన ఈ మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. 7.3 IMDb రేటింగ్‌తో ఉన్న ఈ సినిమా పేరు ఐడెంటిటీ. ఇది మిస్టరీ సినిమా. పూర్తిగా సినిమాటిక్ రోలర్‌కోస్టర్. ఒక పోలీస్, స్కెచ్ ఆర్టిస్టు ఒక జంట. వారిద్దరూ ఒక సంక్లిష్టమైన హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లోతుగా వెళ్లే కొద్ది వారికి మరిన్ని రహస్యాలు బయటపడతాయి.
ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్, ట్విస్టులతో సాగుతుంది. సినిమా మొదలైన 15 నిమిషాలకే మీకు తర్వాతి సీన్స్ గురించి ఉత్సుకత ఏర్పడుతుంది. యాక్షన్ సన్నివేశాల నుంచి సస్పెన్స్ ట్విస్టుల వరకు ప్రతి సీన్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించలేరు. 2 గంటల 37 నిమిషాల నిడివితో విడుదలైన ఐడెంటిటీ ఇప్పుడు జీ5లో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
ఈసినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ సహా పలు భాషలలో ప్రసారమవుతుంది. అనాస్ ఖాన్, అఖిల్ పాల్ దర్శకత్వం వహించి, రాసిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, టోవినో థామస్, గోపికా రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








