AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో మరో రియల్ రియల్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో 9.7 రికార్డ్ రేటింగ్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

నిజ జీవితంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. ఐఎమ్ డీబీ లో ఈ మూవీకి ఏకంగా 9.7 రేటింగ్ రావడం విశేషం

OTT Movie: ఓటీటీలో మరో రియల్ రియల్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో 9.7 రికార్డ్ రేటింగ్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 21, 2025 | 7:57 PM

Share

.ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, హారర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటాయి. ఆడియెన్స్ తమ ఆలోచనలు, అభిరుచి, ఇష్టాలను బట్టి సినిమాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓటీటీలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ఆడియెన్స్ ను ఆలోచింపజేస్తాయి. ఈ మూవీ కూడా సరిగ్గా అలాంటిదే. నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది మేలో థియేటర్లలో విడుదలైంది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. మరీ ముఖ్యంగా ఐఎమ్‌డీబీలో ఈ మూవీకి ఏకంగా 9.7/10 రికార్డ్ రేటింగ్‌ రావడం విశేషం. ఐఎండీబీలో ఇలాంటి టాప్ రేటింగ్ రావడమంటే మామూలు విషయం కాదు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రానుంది. హిందీతో పాటు ఈ చిత్రం త్వరలో తమిళం, తెలుగు, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా కథ నమిత్ భరద్వాజ్ అనే ఓ ఫిజిక్స్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు తన కూతురు చదివే పాఠశాల చరిత్ర పుస్తకంలోని తప్పులను గమనిస్తాడు. ఇందులో భారతీయ చరిత్రను వక్రీకరించి, మొగల్, బ్రిటిష్ యుగాలకు ముందు భారతదేశ ఘనతను తక్కువ చేస్తున్నాయని తెలుసుకుంటాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ (RTI) యాక్ట్ ద్వారా పాఠశాల పాఠ్యాంశాలను ప్రశ్నిస్తూ న్యాయ స్థానంలో పోరాటం మొదలు పెడతాడు. హిస్టరీ ప్రొఫెసర్ కమల్ సహాయంతో ఆర్యుల పుట్టుక, మొగల రాజుల పాలన, 1857 స్వాతంత్య్ర సమరం గురించి పాఠ్యపుస్తకాల్లో ఉన్న అవాస్తవాల గురించి ప్రశ్నిస్తాడు. ఇది ఒక్కసారిగా సంచలనం రేపుతుంది. ఒక్కసారిగా విద్యా వ్యవస్థలో అలజడి మొదలవుతుంది. అయితే సమాజంలోని వ్యతిరేక శక్తులు నమిత్ ను ఒంటరి వాడిని చేస్తాయి. .మరి ఫిజిక్స్ టీచర్ ఈ యుద్ధంలో గెలిచాడా? చివరికి ఏం జరిగింది? పాఠశాలల్లో పిల్లలకు భారతదేశ చరిత్ర గురించి నేర్పిస్తున్న ఆ అవాస్తవాలు ఏంటి? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

భారతీయ విద్యావిధానంలోని లోపాలను ప్రశ్నిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఆలోజింప చేసింది. ఈ సినిమా పేరు హిజ్ స్టోరీ ఆఫ్ ఇతిహాస్. త్వరలోనే జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..