AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ జబ్బు ఉన్న అమ్మాయిలే ఈ సైకో కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో పిచ్చెక్కించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం దుమ్మురేపుతుంటాయి. మరీ ముఖ్యంగా హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక సీరియల్ కిల్లర్ కథకు సంబంధించినది.

OTT Movie: ఆ జబ్బు ఉన్న అమ్మాయిలే ఈ సైకో కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో పిచ్చెక్కించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 20, 2025 | 2:00 PM

Share

ఇతర జానర్లతో పోల్చితే హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. అందుకోసమే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఈ జానర్ మూవీస్ నే ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఆయా భాషల ఆడియెన్స్ కు తగ్గట్టుగానే డబ్ చేసి ఓటీటీలోకి రిలీజ్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక సీరియల్ కిల్లర్ జానర్ కు సంబంధించిన మూవీనే. ఇందులో ఒక సైకో కిల్లర్ కేవలం అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చంపుతాడు. పోలీసులు సైతం అతన్ని పట్టుకోలేకపోతారు. చెప్పుకోవడానికి కథ సాధారణంగానే ఉన్నా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ మూవీ మొత్తం భువనేష్ చుట్టూ తిరుగుతుంది. అతని తల్లి శివగామి క్యాన్సర్‌తో బాధపడుతుంది. ట్రీట్ మెంట్ లో నొప్పిని భరించలేక మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం) కోసం వేడుకుంటుంది. దీంతో భువనేష్ తన తల్లి బాధను చూడలేకపోతాడు. ఆమె కోరికను నెరవేర్చడానికి ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుంటాడు. అప్పటి నుంచి హీరో వరుసగా అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ దారుణంగా చంపుతాడు. ముఖ్యంగా రోగంతో బాధపడే అమ్మాయిలనే ఎంపిక చేసుకుని మరీ హతమారుస్తాడు

ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు ఇన్‌స్పెక్టర్ రఘురామ్ రంగంలోకి దిగుతాడు. అతని విచారణ లో భువనేష్ గతం, అతని ఉద్దేశ్యాలు, ఈ హత్యల మధ్య ఉన్న లింకుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరీ ఇంతకీ భువనేష్ ప్రత్యేకించి అమ్మాయిలనే చంపడానికి గల కారణాలేంటి? అతని చేతిలో చనిపోయిన అమ్మాయిలు ఎవరు? అసలు ఈ సైకో గతం ఏంటి? అతను ఎందుకిలా మారిపోయాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు సైలెంట్. సుమారు 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ… అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకో కిల్లర్ సినిమాలంటే బాగా ఇష్టపడేవారికి ఈ ‘సైలెంట్’ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్