AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు పొట్టకూటి కోసం మిల్లులో వర్కర్.. ఇప్పుడు 300 కోట్ల సూపర్ స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ క్రింది ఫొటోలో సాదా సీదాగా కనిపిస్తోన్న వ్యక్తిని గుర్తు పట్టారా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అతనొక స్టార్ సెలబ్రిటీ. స్టార్ హీరోలు, హీరోయిన్లకు మించి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు రూ. 1200 లతో ముంబైలోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు 300 కోట్లకు యజమాని.

Tollywood: ఒకప్పుడు పొట్టకూటి కోసం మిల్లులో వర్కర్.. ఇప్పుడు 300 కోట్ల సూపర్ స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jul 20, 2025 | 6:59 AM

Share

భారతదేశ ఆర్థిక రాజధానిగా ముంబైకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సిటీని కలల నగరం అని కూడా పిలుస్తారు. అందుకే దేశవ్యాప్తంగా పొట్టకూటి కోసం వేలాది మంది ప్రతిరోజూ ముంబైకి వస్తుంటారు. కొందరు పని వెతుక్కుంటూ వస్తే, మరికొందరు తమ కలలను నెరవేర్చుకోవాలని ఈ ముంబైకు వస్తుంటారు. పేరుకు తగ్గట్టుగానే ముంబై చాలా మంది కలలను నెరవేర్చింది. ఎంతో మంది సినిమా స్టార్‌లను తయారు చేసింది. అందులో ఈ బాలీవుడ్ స్టార్ కూడా ఉన్నాడు. ఒకప్పుడు కేవలం 1200 రూపాయలతో ముంబైకి వచ్చాడు, కానీ ఇప్పుడు అతని సంపద 300 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. అతను మరెవరో కాదు కామెడీ కింగ్ కపిల్ శర్మ. పంజాబ్ లోని అమృత్ సర్ లో పుట్టి పెరిగాడు కపిల్. తండ్రి పంజాబ్ పోలీస్ లో పనిచేసేవాడు. కానీ కపిల్ చిన్న వయసులో ఉండగానే తండ్రి మరణించాడు. మొట కపిల్ గాయకుడిగా మారాలని అనుకున్నాడు. కానీ విధి అతన్ని కామెడీ వైపు మళ్లించింది. కెరీర్ ప్రారంభంలో థియేటర్ లో నాటకాలు రాయడం మొదలుపెట్టాడు కపిల్.ఇది అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అతనికి అమృత్ సర్ లోని ఒక కళాశాలలో అడ్మిషన్ దొరికింది. కానీ కళాశాల లో డిగ్రీ పూర్తి చేయడానికి ముందే తన కలలను నెరవేర్చుకోవడానికి ముంబైకి బయలుదేరాడు.

కపిల్ శర్మ రూ.1200 తో ముంబైకి వచ్చాడు. మొదట్లో అతనికి ఎలాంటి పని దొరకలేదు. దీంతో అమృత్‌సర్‌కు తిరిగి వచ్చి ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ కోసం ఆడిషన్‌కు వెళ్లాడు. కానీ అక్కడ అతనికి నిరాశే ఎదురైంది. కానీ మళ్ళీ ఢిల్లీకి వెళ్లి ఆడిషన్‌కు హాజరయ్యాడు. షో విజేతగా నిలిచాడు. దీంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు కపిల్. ఈ షో ద్వారా సంపాదించిన డబ్బుతో తన సోదరి వివాహం చేశాడు. ఆ తర్వాత, అతను అనేక కామెడీ షోలు చేసి విజయం సాధించాడు. కపిల్ ‘K9’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. దీని ద్వారా అతను ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ అనే షోను ప్రారంభించాడు. ఈ షో ముగిసిన తర్వాత, అతను ‘ది కపిల్ శర్మ షో’ను ప్రారంభించాడు. ఇది సూపర్ హిట్ అయింది. ఈ మధ్యకాలంలో అతను 2015లో ‘కిస్ కిస్ కో ప్యార్ కరూన్’ చిత్రంలో కూడా పనిచేశాడు.

ఇవి కూడా చదవండి

మృణాళ్ ఠాకూర్ తో కపిల్ శర్మ..

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

కపిల్ శర్మ ఆస్తులు ఎంతంటే?

నివేదికల ప్రకారం, కపిల్ మొత్తం ఆస్తులు దాదాపు రూ.330 కోట్లు. ఆయనకు వోల్వో XC90, మెర్సిడెస్ బెంజ్ S350 CDI వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కపిల్ ప్రతి సంవత్సరం రూ.15 కోట్ల పన్నులు చెల్లిస్తారు. పంజాబ్‌లో రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన ఫామ్‌హౌస్, ముంబైలో రూ.15 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కూడా కపిల్ కు ఉన్నాయని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..