AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటిని చూస్తారా..? ప్రపంచ కుబేరుడి ఇల్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెక్సాస్‌లోని తన సాదాసీదా నివాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా బిలియనీర్లు విలాసవంతమైన భవనాల్లో నివసిస్తారని మనం అనుకుంటాం. కానీ, టెక్సాస్‌లో మస్క్ నివసిస్తున్న ఇల్లు చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటిని చూస్తారా..? ప్రపంచ కుబేరుడి ఇల్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
Elon Musk Tiny House
Jyothi Gadda
|

Updated on: Mar 14, 2026 | 4:56 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆయన తన వ్యాపార నిర్ణయాల వల్ల కాదు, తన నివాసం వల్ల చర్చల్లో నిలిచారు. టెక్సాస్‌లోని ఆయన చిన్నపాటి ఇంటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సాధారణంగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు రాజభవనాల్లాంటి ఇళ్లలో నివసిస్తారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఇందుకు భిన్నం. టెక్సాస్‌లోని బోకా చికాలో తన స్పేస్ ఎక్స్ కంపెనీ సమీపంలో ఒక చిన్న బాక్సబుల్ (Boxabl) ఇంటిలో ఆయన ఉంటున్నారు. ఈ ఇంటి విస్తీర్ణం కేవలం 400 చదరపు అడుగులు మాత్రమే. దీని విలువ సుమారు 50,000 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 42 లక్షల రూపాయలు. ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు కూడా దీనికంటే ఖరీదైనదిగా ఉంటుంది.

ఇక ఆ ఇంటి లోపల ఏముందో చూస్తే..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో మస్క్ ఇంటి అంతర్గత దృశ్యాలను చూడవచ్చు. ఇందులో ఒక చిన్న కిచెన్, పక్కనే బెడ్, ఒక చిన్న సోఫా, టీవీ ఉన్నాయి. భారీ అలంకరణలు లేదా పని మనుషుల సందడి ఏమీ కనిపించదు. నిజానికి మస్క్ తన వద్ద ఉన్న కాలిఫోర్నియాలోని విలాసవంతమైన విల్లాలు, ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇలా అద్దె ఇంట్లో, చిన్న ఇళ్లలో నివసించడం ప్రారంభించారు. మానవాళిని ఇతర గ్రహాలకు తీసుకెళ్లాలనే తన గొప్ప కల కోసం సంపదను పొదుపు చేయడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.

నెటిజన్ల రియాక్షన్:

ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మనుషులు ఆస్తుల కోసం పాకులాడుతుంటే, ఈయన మాత్రం ఆస్తులను వదులుకుని లక్ష్యం కోసం బతుకుతున్నారు అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఎలాన్ మస్క్ సింప్లిసిటీకి ఈ ఇల్లు ఒక గొప్ప నిదర్శనమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ లిటిల్ హోమ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మస్క్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us