AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuberaa OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్, నాగ్‌ల 100 కోట్ల సినిమా.. ఆ సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్! ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో మెరిశారు.

Kuberaa OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్, నాగ్‌ల 100 కోట్ల సినిమా.. ఆ సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్! ఎక్కడంటే?
Kuberaa Movie
Basha Shek
|

Updated on: Jul 18, 2025 | 6:45 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా కుబేర. టాలీవుడ్ లో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉన్న శేఖర్ కమ్ముల ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో జూన్ 20న విడుదలైన కుబేర సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన కుబేర సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మల్టీ స్టారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కుబేర సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటికే అమెజన్ ప్రైమ్ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో చెప్పినట్లుగానే నాగ్, ధనుష్ ల మూవీ శుక్రవారం (జులై 18) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా కుబేర సినిమాను నిర్మించారు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ తో పాటు దలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్య దేకటే, హరీష్ పెరడి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో బిక్షగాడిగా ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే నాగ్ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

డిలీటెడ్ సీన్స్ తో పాటు రష్మిక సాంగ్ కూడా !

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..