AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పోలీసులే టార్గెట్.. హింట్ ఇచ్చి మరీ హత్యలు చేసే కిల్లర్.. ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. సీరియల్ హత్యలు జరగడం, వాటికి కారణమైన కిల్లర్లను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు.. ఇలా ఎంతో ఎంగేజింగ్ తో ఈ సినిమాలు సాగుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే.

OTT Movie: పోలీసులే టార్గెట్.. హింట్ ఇచ్చి మరీ హత్యలు చేసే కిల్లర్.. ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 17, 2025 | 11:52 AM

Share

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను అన్ని భాషల వారు ఆదరిస్తున్నారు. అందుకే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక మలయాళం సినిమాను ఆయా భాషలకు తగ్గట్టుగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. కేరళలోని వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బాతెరీ నేపథ్యంలో సాగుతుంది. ఇక్కడ గత 48 గంటల్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను ఒక గ్యాంగ్ దాడి చేసి హతమారుస్తుంది. ఈ హత్యలు చేసిన సమయంలో, నేరస్థులు రక్తంతో గోడపై ఒక బాణం గుర్తును గీస్తారు. దీంతో ఈ కేసును ఛేదించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జోషీ మాథ్యూ రంగంలోకి దిగుతాడు. కేసును తనదైన శైలిలో దర్యాప్తు చేస్తూ నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో పోలీసుల హత్యల వెనక ఉన్న గ్యాంగ్, వారి ఉద్దేశాలను తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. ఈ క్రమంలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి ఆ హత్యల వెనక ఉన్నదెవరు? వారి నేపథ్యమేంటి? ఎందుకు పోలీసులను టార్గెట్ చేశారు? చివరికి వారు పోలీసులకు ఎలా చిక్కారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ మలయాళం సినిమా పేరు అస్త్ర (Asthra). డిసెంబర్ 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడీ మూవీ వచ్చే శుక్రవారం (జులై 18) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మనోరమ మ్యాక్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఆజాద్ అలవిల్ తెరకెక్కించిన ఈ సినిమాలో  సుహాసిని కుమరన్, సెంథిల్ కృష్ణ, సుధీర్ కరమణ, కళాభవన్ షాజోన్ కీలక పాత్రలు పోషించారు.  క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారికి అస్త్ర ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.

ఈ శుక్రవారం (జులై 18) వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.