AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్‌కు మరో హీరోయిన్ దొరికేసింది.. ఆడిషన్స్‌లోనే అదరగొట్టిన స్టార్ నటుడి కూతురు.. వీడియో వైరల్

స్టార్ హీరోల, హీరోయిన్ల వారసులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం సర్వసాధారణమే. ఇప్పుడొక మరో స్టార్ కిడ్ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె ఆడిషన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tollywood: టాలీవుడ్‌కు మరో హీరోయిన్ దొరికేసింది.. ఆడిషన్స్‌లోనే అదరగొట్టిన స్టార్ నటుడి కూతురు.. వీడియో వైరల్
Star Actor Daughter
Basha Shek
|

Updated on: Jul 16, 2025 | 7:40 AM

Share

సినిమాల్లోకి మరో స్టార్ కిడ్ రాబోతుంది. తండ్రి బాటలోనే పయనిస్తూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నటనలో శిక్షణలో తీసుకుంటోన్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తన ఫొటోలు, వీడియోలతో నెటిజన్ల మదిని దోచుకుంది. ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఒక ఆడిషన్స్ కు హాజరైంది. దీనిని ఆమె తండ్రి, నటుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంతోషంతో మురిసిపోయాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ఇందులోఆ స్టార్ కిడ్ మరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించింది. దీనిని చూసిన నెటిజన్లు నటుడి కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సహజంగా నటించిందని, గుడ్ లుకింగ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే సమయంలో మరికొందరు ఈ క్యూటీ అచ్చం రాధికా ఆప్టే మాదిరిగా ఉందని ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కుమార్తె షోరా సిద్ధిఖీ

తాజాగా తన కూతురి ఆడిషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నవాజుద్దీన్. అయితే తన పోస్టుకు #bollywood తోపాటు #hollywwod హ్యాష్‌ట్యాగ్‌ యాడ్‌ చేయడంతో షోరా హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తుందేమోనని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 15 ఏళ్ల షోరా కొంతకాలంగా నటనలో శిక్షణ తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

నవాజుద్దీన్ సిద్ధిఖీ కూతురు ఆడిషన్స్ వీడియో..

ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకంఉది షోరా. తండ్రితో కలిసి ఆమె గతేడాది ఓ వివాహ వేడుకకు హాజరైంది. అప్పటి ఫొటోలు కూడా క్షణాల్లోనే నెట్టింట వైరలయ్యాయి. చాలా మంది షోరాను దీపికా పదుకొణెతో పోల్చారు. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సైంధవ్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు.

 ఓ పెళ్లి వేడుకలో నవాజుద్దీన్ సిద్ధిఖీ గారాల పట్టి.. వీడియో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్