AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: గాలి జనార్దన్ రెడ్డి కుమారుడితో సినిమా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

మాజీ మంత్రి, ప్రముఖ రజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను నటిస్తోన్న మొదటి చిత్రం జూనియర్. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో అందాల తార జెనీలియా మరో కీలక పాత్రలో కనిపించింది.

Sreeleela: గాలి జనార్దన్ రెడ్డి కుమారుడితో సినిమా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
Sreeleela
Basha Shek
|

Updated on: Jul 15, 2025 | 9:31 AM

Share

వరుస అపజయాలు ఎదురవుతున్నా శ్రీలీల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. మొన్నటి రాబిన్ హుడ్ వరకు శ్రీలీల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మనే ట్రెండింగ్ హీరోయిన్. ప్రస్తుతం శ్రీలీల జూనియర్ అనే ఓ సినిమాలో నటిస్తోంది. మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న జూనియర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ కు మంచిగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక జూనియర్ మూవీపై హైప్ ఉండానికి ప్రధాన కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీల కారణంగానే ఈ మూవీపై ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

జూనియర్ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన ‘వైరల్ వయ్యారి’ అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తోన్న శ్రీలీల కొత్త హీరోతో చేసేందుకు గట్టిగానే రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది శ్రీలీల. అయితే జూనియర్ కోసం మాత్రం ఆమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్ నడుస్తోంది. కాగా బెంగళూరులోనే పుట్టి పెరిగిన శ్రీలీల కన్నడ మూవీతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత జూనియర్ సినిమాతో కన్నడ ఆడియెన్స్ ను పలకరిస్తోంది.

ఇవి కూడా చదవండి

జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్..

జూనియర్ సినిమాలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ‘మాయాబజార్’ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఈ  చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలకు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ ‘జూనియర్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

వైరల్ వయ్యారీ సాంగ్ లో శ్రీలీల స్టెప్పులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..