AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త నుంచి తేరుకోకముందే స్టంట్ మాస్టర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పలువురు స్టార్ హీరోలు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళులు అర్పిస్తున్నారు

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?
Vishal, Arya
Basha Shek
|

Updated on: Jul 13, 2025 | 7:27 PM

Share

తమిళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తంగలాన్ డైరెక్టర్ పా. రంజిత్, ఆర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రాజు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బుధవారం సినిమా షూటింగ్ లో భాగంగా రాజ ఓ కారు స్టంట్ చేస్తుండగా యాక్సిడెంట్‌ జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్టార్ హీరో విశాల్ రాజు మృతిని అధికారికంగా ప్రకటించారు. విశాల్ హీరోగా నటించిన పలు సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరించాడు రాజు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళి అర్పించాడు విశాల్. రాజు కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

‘ ఈ రోజు ఉదయం సినిమా షూటింగ్ లో కార్ స్టంట్ చేస్తూ మాస్టర్ రాజు మరణించాడన్న విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. రాజు ఇక లేడనే దుర్వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నేను నటించిన పలు సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేశాడు. రాజు చాలా రిస్కీ స్టంట్ చేస్తాడు. ఎందుకంటే అతను చాలా ధైర్య వంతుడు. అలాంటి రాజు ఇక లేడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. అలాగే రాజు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబీకులకు మరింత ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజు కుటుంబ సభ్యులకు నేను అండగా ఉంటాను. భవిష్యత్ లో వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’ అని ట్వీట్ లో రాసుకొచ్చాడు విశాల్.

ఇవి కూడా చదవండి

హీరో విశాల్ ట్వీట్..

అయితే స్టంట్ మాస్టర్ రాజు మరణంపై అటు హీరో ఆర్య కానీ, డైరెక్టర్ పా. రంజిత్ కానీ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు