OTT Movie: ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అలజడి రేపే సైకో కిల్లర్.. ఓటీటీలో లేటెస్ట్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
నేరాలే జరగని ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉన్నట్లుండి ఒక సైకో కిల్లర్ అలజడి సృష్టిస్తాడు. ఒక ముసుగు ధరించి రాత్రి వేళల్లో సంచరించే వారిని దారుణంగా చంపేస్తుంటాడు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఆ హత్యల వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ మధ్యన మలయాళం సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఓటీటీలో ఈ మాలీవుడ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆసక్తికరమైన కథా, కథనాలు, డిఫరెంట్ మేకింగ్ తో మలయాళం సినిమాలు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ సినిమా కూడా మలయాళం సినిమానే. క్రైమ్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంతో సాగుతుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆకట్టుకునే కథా, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు పుష్కలంగా ఉండడంతో సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (జులై 11) నుంచి అర్ధరాత్రి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేరళలోని ప్లాచ్చిక్కావు అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ప్రశాంతతకు మారుపేరైన ఈ గ్రామంలో ఉన్నట్లుండి ఒక సైకో కిల్లర్ అలజడి సృష్టిస్తాడు. బూగీమాన్ అని పిలువబడే ఒక ముసుగు ధరించిన వ్యక్తి. రాత్రిపూట ఒంటరిగా తిరిగే వ్యక్తులను టార్గెట్ చేసుకుని దారుణంగా హతమారుస్తాడు. ఈ హత్యలు గ్రామంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తాయి. కాగా ఇదే గ్రామంలో ఉండే హీరో ఉజ్జ్వలన్ వివిధ కేసుల్లో పోలీసులకు బాగా సహకరిస్తుంటాడు. ఇదే క్రమంలో సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తాడు.
అయితే పోలీసులతో పాటు గ్రామస్తులు ఎవరూ ఉజ్వలన్ ను లెక్కచేయరు. మరోవైపు సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు CI శంభు మహాదేవ్ నాయకత్వంలో ఒక బృందం ప్లాచ్చిక్కావు వస్తుంది. అయితే ఉజ్జ్వలన్ తన డిటెక్టివ్ నవలల నుంచి నేర్చుకున్న టెక్నిక్‌లను ఉపయోగించి సైకో కిల్లర్ ను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి ఉజ్జ్వలన్ ఆ కిల్లర్ ని పట్టుకుంటాడా ? అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు డిటెక్టివ్ ఉజ్వలన్. ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్, రోనీ డేవిడ్ రాజ్, కొట్టాయం నజీర్, సీమా జి. నాయర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Twists, turns, and suspense! Detective Ujjwalan’s got it all! #DetectiveUjjwalan #WeekendCinematicUniverse #Netflix pic.twitter.com/Ewkn6mIdyO
— Mohammed Salih Hafeele (@hafeelesalih) July 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








