OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రియల్ స్టోరీ.. ఒళ్లు జలదరించే సీన్స్.. ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ.. తెలుగులోనూ..
ప్రస్తుతం మలయాళ సినిమాలకు క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో మాలీవుడ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళ సినిమానే. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. చిలకలూరి పేట బస్సు దహనం కేసు ఆధారంగా ఇటీవల ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఇరవై మూడు సినిమాకు అటు థియేటర్లు, ఇటు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రాజీవ్ గాంధీ హత్యోదంతంపై తెరకెక్కిన ది హంట్ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో దూసుకుపోతోంది. ఇ ప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఓ రియల్ స్టోరీనే. మేలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు రెండింతల లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఐఎమ్ డీబీలోనూ ఈమూవీకి 7.5 రేటింగ్ దక్కడం విశేషం. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పుపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఒక రోజు ముందుగానే. 2003లో కేరళలో జరిగిన ఓ నరమేధం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముత్తంగ అనే ఆదివాసీ లు తమ భూ హక్కుల కోసం చేసే పోరాటం, దానిని అణచివేసేందుకు పోలీసులు చేసిన క్రూరమైన చర్యలను ఈ మూవీలో చూపించారు మేకర్స్. గిరిజనులను అక్కడి నుంచి తరిమేసే నేపథ్యంలో గిరిజనులు, పోలీసుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. జులై 11 నుంచి సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు స్ట్రీమింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమంగ్ అవుతోంది.
ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా? మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నరివెట్ట. తెలుగులో నక్కల వేట పేరుతో థియేటర్లలో రిలీజైంది. అనురాజ్ మనోహర్ తెరకెక్కించిన ఈ సినిమాకు కథను అబిన్ జోసెఫ్ అందించాడు. సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడు మరో కీలక పాత్ర పోషించాడు. యాక్షన్ సినిమాలు, అందులోనూ మలయాళ సినిమాలను ఇష్టపడేవారు ఈ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
Disclaimer: This journey will stay with you long after it ends
Watch #Narivetta streaming now only on Sony LIV@ttovino #SurajVenjaramoodu #Cheran #AnurajManohar #AryaSalim #JakesBijoy #SonyLIVSouth pic.twitter.com/vZGjkwNpTj
— Sony LIV (@SonyLIV) July 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








