Tollywood: ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోయింది.. 2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ ఇవే.. జాబితా రిలీజ్ చేసిన ఐఎమ్‌డీబీ
2025 ప్రారంభమై అప్పుడే ఆరు నెలలు గడిచాయి. ఈ నేపథ్యంలో ఈఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన పది భారతీయ చిత్రాల జాబితాను ప్రఖ్యాత ఐఎమ్‌డీబీ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో హిందీ, తమిళ్, మలయాళ సినిమాలు ఉన్నాయి.

సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల గురించి సమాచారం కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అధికారిక సోర్స్ అయిన IMDb (www.imdb.com) 2025 ఫస్టాప్ టాప్-10 మూవీస్ జాబితాను విడుదల చేసింది. జనవరి 1, 2025 నుంచి జూలై 1, 2025 మధ్య కాలంలో విడుదలైన అన్ని సినిమాలకు వచ్చిన ఆడియెన్స్ రెస్పాన్స్, రేటింగ్ ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఛావా మొదటి స్థానంలో నిలిచింది. లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక రెండో స్థానంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ నిలిచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా దేవా, రైడ్ 2, రెట్రో సినిమాలు నిలిచాయి. కాగా ఈ జాబితాలో ఎక్కువగా హిందీ, తమిళ్, మలయాళ సినిమాలకే స్థానం దక్కింది. అదే సమయంలో ఒక్క తెలుగు సినిమా కూడా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
2025 లో ఇప్పటివరకు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలు
- చావా
- డ్రాగన్
- దేవా
- రైడ్ 2
- రెట్రో
- ద డిప్లోమాట్
- L2: ఎంపురాన్
- సితారే జమీన్ పర్
- కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్
- విడాముయార్చి
‘Tis the season of lists, and we’re back with the ultimate one! 🌟
ఇవి కూడా చదవండిHalfway through 2025, we’re excited to share the Most Popular Indian Movies of 2025 so far. 🎬✨
Which one is your favourite? 👀🍿
📍Of all the movies released in India between January 1, 2025 and July 1, 2025,… pic.twitter.com/l7I4yeJQk1
— IMDb India (@IMDb_in) July 9, 2025
#IMDb Announces Most Popular Indian Movies of 2025 So Far:
1- #Chhaava – Led By #VickyKaushal, #RashmikaMandanna, and #AkshayeKhanna
2- #Dragon – #PradeepRanganathan
3- #Deva – #ShahidKapoor & #PoojaHegde
4- #Raid2 – #AjayDevgn & #RiteishDeshmukh
5- #Retro – #Suriya &… pic.twitter.com/QeTAxs3J2E
— Ashwani kumar (@BorntobeAshwani) July 9, 2025
దీంతో పాటు ఈ ఏడాది ఆడియెన్స్ ఎదురు చూస్తోన్న సినిమాలను జాబితాను కూడా ఐఎమ్ డీబీ రిలీజ్ చేసింది. ఇందులో రజనీకాంత్ కూలీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. అలాగే ఎన్టీఆర్- హృతిక్ రోషన్ ల సినిమా వార్ 2 సెకెండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది రాజాసాబ్ సినిమా ఈ జాబితాలో మూడో స్థానం కైవసం చేసుకుంది.
అవేంటంటే..
- కూలీ
- వార్ 2
- రాజా సాబ్
- ఆంఖోన్ కి గుస్తాఖియాన్
- సైయారా
- బాఘి 4
- సర్దార్ కుమారుడు 2
- హృదయపూర్వకం
- మహావతార నరసింహ
- ఆల్ఫా
— IMDb India (@IMDb_in) July 9, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








