Tollywood: ఒకప్పుడు సినిమాల్లో బిజి బిజీగా.. ఇప్పుడు పవర్ లిఫ్టింగ్‌లో పతకాల వర్షం.. ఈ టాలీవుడ్ నటి ఎవరో తెలుసా?
ఈ అందాల గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు సినిమాలు తగ్గించేసిన ఆమె పవర్ లిఫ్టింగ్ లో పతకాల వర్షం కురిపిస్తోంది.

కృషి, పట్టుదల, సాధించాలన్న తపన ఉంటే వయసు అనేది పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. అందుకే చాలా మంది లేటు వయసులోనూ డిగ్రీలు , పీహెచ్‌డీలు చేస్తున్నారు. రన్నింగ్ రేసుల్లో పతకాలు సాధిస్తున్నారు. తమ ట్యాలెంట్ తో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాటను నిజం చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ టాలీవుడ్ సీనియర్ నటి కూడా ఒకరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె అంతగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లకు అమ్మగా.. అక్కగా.. వదినగా అనేక రకాల పాత్రలలో నటించి మెప్పించింది. తన నటనతోనూ, కామెడీ టైమింగ్ తోనూ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ నటిగా మారిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కలిసి సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించిందామె. మొన్నటి వరకు సినిమాల్లో బిజి బిజీగా గడిపిన ఆమె ఇప్పుడు జిమ్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. 50 ఏళ్ల వయసులోనూ కఠినమైన వర్కౌట్లు, వ్యాయామాలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక కొన్ని నెలల క్రితం ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చిందీ అందాల తార. అంతే కాదు నేషనల్ లెవెల్ పోటీల్లోనూ పాల్గొని పతకాలు సైతం గెల్చుకుంటోంది. లేటు వయసులోనూ ఈ అందాల తార చూపిస్తున్న తెగువను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ డెడికేషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు? మన టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి.
కొన్నినెలల క్రితం కఠిన మైన వర్కవుట్లు, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రగతి. అయితే సినిమాల్లో బిజిబిజీగా ఉన్న ఆమె ఏదో ఫిట్ నెస్ కోసం లేదా ఏదో సరదాకి వీటిని పోస్ట్ చేస్తుందనుకున్నారు చాలామంది. కానీ తన శ్రమ వెనక ఓ లక్ష్యం ఉందని ఆ తర్వాతే అర్థమైంది. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారిన ప్రగతి ఇప్పటికే పలు నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంది. ఎన్నో పతకాలు గెల్చుకుంది.
ప్రగతి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇక గతంలో కంటే బాగా సినిమాలు తగ్గించేసింది ప్రగతి. గతేడాది తిరగబడరా సామి సినిమాలో నటించిన ఆమె ఈ ఏడాది నారి సినిమాలో మెరిసింది. సినిమాలు తగ్గించేసినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. అలాగే పలు సినిమా ఈవెంట్లోలోనూ మెరుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




