AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను ఐలవ్ యూ చెప్పగానే ఓకే చేశా.. అది లైఫ్‌లో అందమైన జ్ఞాపకం అంటున్న అనుష్క

2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి. విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, శౌర్యం, చింతకాలయ రవి, కింగ్, బిల్లా, సింగం, రగడ, మిర్చి, డమరుకం, బాహుబలి, బాహుబలి 2 , మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి హిట్ సినిమాల్లో నటించింది. అలాగే అరుంధతి, రుద్రమ దేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్ధం తదితర లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ హిట్స్ కొట్టింది.

అతను ఐలవ్ యూ చెప్పగానే ఓకే చేశా.. అది లైఫ్‌లో అందమైన జ్ఞాపకం అంటున్న అనుష్క
Anushka Shetty
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2025 | 10:21 AM

Share

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది. ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అరుంధతి (2009), ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు వంటివి లభించాయి. అనుష్క బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాల్లో దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ చిత్రాలు ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి.

ఇతర ముఖ్యమైన చిత్రాలు రుద్రమదేవి (2015), సైజ్ జీరో (2015), భాగమతి (2018) వంటివి ఉన్నాయి. అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్‌గా చేసింది. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద ఆమె యోగా నేర్చుకుంది. త్వరలోనే అనుష్క ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే అనుష్క వయసు 40ఏళ్ళు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్ గా ఉంటుంది ఈ చిన్నది. కాగా అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే ఫిలిం సర్కిల్స్ లో అనుష్క పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

అయితే అనుష్కకు చాలా లవ్ ప్రపోజల్ వచ్చాయట.. అయితే అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడొచ్చిందో తెలుసా.? అనుష్కకు ఆరో తరగతిలోనే లవ్ ప్రపోజల్స్ వచ్చాయట.. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. అప్పుడు నాకు ఐలవ్యూ అంటే అర్ధం కూడా తెలియదు.. అతను ప్రపోజ్ చేయగానే ఓకే అని చెప్పేశా.. అది నా జీవితంలో ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అని తెలిపింది అనుష్క.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..