Kuberaa: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ కుబేర.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిరుపేద, ధనిక వ్యత్యాసం చూపిస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.

స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 150కోట్లకు పైగా వసూల్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ నటన పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల మేకింగ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగార్జున తొలిసారి డిఫరెంట్ రోల్ లో కనిపించి మెప్పించారు.
ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ దేవీ ఇరగదీశాడు. ఇక ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దూసుకుపోతుంది ఈ సినిమా.. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకుల ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ చక్కర్లు కొడుతుంది.
కుబేర సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి అని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కుబేర సినిమా రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. త్వరలోనే ఓటీటీలోకి రానుంది తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 50 కోట్లకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తుంది. జూలై 20న స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. త్వరలోనే కుబేర సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.