AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 6 నెలల్లో 3 బ్లాక్ బస్టర్లు.. ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు శుక్ర మహర్దశ

2025 ప్రారంభమై అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం గడిచిన ఈ ఆరు నెలల కాలంలో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ హిట్స్ సొంతం చేసుకుంది.

Tollywood: 6 నెలల్లో 3 బ్లాక్ బస్టర్లు.. ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు శుక్ర మహర్దశ
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 07, 2025 | 2:43 PM

Share

ప్రస్తుతం ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు శుక్ర మహర్దశ పీక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2025 మొదటి భాగంలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఒక్క హిట్టు లేక సతమతమవుతుంటే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా మూడు భారీ బ్లాక్‌బస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. కేవలం ఆరు నెలల్లోనే ఈ బ్యూటీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్, డిమాండ్ ఈ ముద్దుగుమ్మకు ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఈ ముద్దుగుమ్మ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అందుకే దర్శకనిర్మాతలు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ ఏడాదే కాదు గత ఏడాదిలోనూ ఈ సొగసరి హవా నడించింది. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక సినిమా ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. ఈ మధ్యన ఓ సీనియర్ హీరో ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ హీరోయిన్ కు శుక్ర మహర్దశ నడుస్తోందన్నారు. ప్రజెంట్ ఆమె జోరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ గా గోల్డెన్ గర్ల్ గా మారిపోయిన ఆ బ్యూటీ మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

2025లో నూ కొనసాగుతోన్న జోరు..

గతేడాది రష్మిక నటించిన పుష్ప 2 సినిమా ఏకంగా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ ఏడాది విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె నటించిన ‘ఛావా’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ హిస్టారికల్ డ్రామా ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే. ఛావా తర్వాత సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘సికందర్’ సినిమా చేసింది రష్మక. ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా వరల్డ్‌వైడ్‌గా రూ.177 కోట్లు రాబట్టింది.

రష్మిక లేటెస్ట్ ఫొటోస్..

ఇక రష్మిక నటించిన లేటెస్ట్ సినిమా కుబేర. జూన్ 20న విడుదలైన ఈ ఈ మూవీ కేవలం 13 రోజుల్లోనే రూ.83.55 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. మొత్తంగా ఈ మూడు చిత్రాలు కలిపి రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. 2025లో మరే ఇండియన్ హీరోకు గానీ, హీరోయిన్‌కు ఈ రికార్డు సాధ్యం కాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!
మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?
మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!