సినిమా ఫ్లాప్ అని కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత.. కట్ చేస్తే సంచలన విజయం సాధించింది
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మొదట ఫ్లాప్ తెచ్చుకున్నప్పటీకీ ఆతర్వాత మాత్రం సంచలన విజయాన్ని అందుకుంటాయి.

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. వారం వారం కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ఎవ్వరూ ఆపలేరు. కథలో బలం ఉంటే చిన్న సినిమా అయినా సరే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇందుకు ఉదాహరణగా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక నిర్మాతలు కూడా సినిమా బడ్జెట్ విషయాల్లో వెనకాడటం లేదు.. ఎంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికైనా సరే రెడీ అంటున్నారు. అయితే కొన్ని సినిమాలు ఊహించినట్టే భారీ విజయాన్ని అందుకొని నిర్మాతకు లాభాలు తెచ్చిపడుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొత్త నష్టాన్ని తెచ్చిపెడతుంటాయి. అయితే ఓ నిర్మాత తన సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.
ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.. ఊహించని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఓ సినిమా విషయంలోనూ అదే జరిగింది. సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నిర్మాత బోరున ఏడ్చాడు.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా 400 రోజులు థియేటర్స్ లో ఆడి నయా రికార్డ్ చేసింది. ఆ సినిమా ఎదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన “దో రాస్తే”. ఇది రాజ్ ఖోస్లా దర్శకత్వంలో రాజేష్ ఖన్నా, ముంతాజ్, బల్రాజ్ సాహ్నీ, ప్రేమ్ చోప్రా వంటి నటులతో రూపొందింది. ఈ చిత్రం కుటుంబ విలువలు, ప్రేమ, బాధ్యతలు, త్యాగం వంటి ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది.
ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
అయితే ఈ సినిమా విడుదల సమయంలో బాంబేలోని రాయల్ ఒపేరా హౌస్‌లో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దాంతో ఈ సినిమా పోతుందని నిర్మాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో రాజేష్ ఖన్నా నటించిన ఆరాధన సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్ మేనేజర్ దేశాయ్ ‘దో రాస్తే’ ఫ్లాప్ అవుతుందని మహేష్ భట్, వామన్ భోంస్లేలతో చెప్పాడు. దాంతో నిర్మాతల్లో ఒక్కరైనా మహేష్ భట్ సినిమా పోతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఎందుకంటే ఆ సినిమా కథతో మహేష్ భట్ ఎంతో కనెక్ట్ అయ్యాడట.. అప్పుడు మహేష్ భట్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే దాంతో అతను ఎమోషనల్ అయ్యి బోరున ఏడ్చాడట. కట్ చేస్తే ‘దో రాస్తే’ రాయల్ ఒపెరా హౌస్‌లో 50 వారాలకు పైగా ఆడింది.
ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.