పచ్చి బూతులు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.. ట్రోలింగ్ పై నటి ఆవేదన
సాధారణంగా సినీతారలను ప్రజలు ఎంతగా అభిమానిస్తారో.. కొన్ని సందర్భాల్లో అంతే విమర్శిస్తారు. తమకు నచ్చిన స్టార్స్ ఏ చిన్న పొరపాటు చేసినా.. ఎలా ప్రవర్తించినా సోషల్ మీడియాలో ఏకిపారేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఫ్యాన్స్ కోపానికి గురైంది. ఇంకేముంది నెట్టింట ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తమ డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే బ్యాడ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు బండబూతులు తిట్టారట.. ఇంతకూ ఆమె ఎవరు.? కారణం ఏంటంటే..
ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..
సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేర్లలో ఉర్ఫీ జావేద్ ఒకరు. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఉర్ఫీ జావేద్ టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఉర్ఫీ జావేద్ చిత్ర విచిత్రమైన డ్రస్సులో కనిపిస్తూ ఉంటుంది.
ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
ఇటీవలే ఉర్ఫీ జావేద్ ఓ రియాలిటీ షోలో విజేతగా నిలిచింది. దాంతో ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు ఉర్ఫీ జావేద్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారట. పిచ్చి మెసేజులు, బూతులు తిడుతూ కామెంట్స్ చేశారు. ఉర్ఫీ ఇన్ స్టా గ్రామ్ లో చెత్త మెసెజ్‌లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉర్ఫీ జావేద్ పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ డ్రస్సులతో హంగామా చేస్తుంటుంది. ఆమెపై కొంతమంది పాజిటివ్ గా ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిని ఉర్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి