AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్ అయ్యాడు..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ.. దూసుకుపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఒకప్పుడు నటులుగా రాణించి ఆతర్వాత అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమాలు వదిలేసి.. ఇతర వృత్తిలో బిజీగా మారిపోతున్నారు. ఇప్పుడు ఓ స్టార్ నటుడు ఆటో నడుపుతూ కనిపించాడు.

ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్ అయ్యాడు..
Actor
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2025 | 7:24 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రం అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు. చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డుమీద పడిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీన స్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు. ఒప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ ఆయన.. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు లేక ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగి, ఆస్కార్ బరిలో నిలిచిన ఆ నటుడి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఆ నటుడు.. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు అతను నటించిన సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. కానీ ఆతర్వాత ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పేరు షఫీక్ సయ్యద్‌. సలాం బాంబే! సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. 1988లో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.

ఈ సినిమా ముంబై వీధుల్లో బతికే పిల్లల కష్టాలను చూపించారు. ఈ సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది. ఈ సినిమాలో చాయ్‌పౌ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. తన అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ అతనికి ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆతర్వాత ‘పతంగ్’ అనే సినిమా ఒక్కటే చేశాడు. అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఆటో నడుపుతున్నాడు. తల్లి, భార్య, నలుగురు పిల్లలతో ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు.కుటుంబ భారాన్ని మోస్తూ ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు షఫీక్ సయ్యద్‌.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!