Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ అంటే మనోడికి చాలా ఇష్టమట..
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంటలలో సూర్య, జ్యోతిక ఒకరు. ఇద్దరు దక్షిణాదిలో స్టార్ హీరోహీరోయిన్స్. కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పాప, బాబు ఉన్నారు.

స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఆతర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో విడుదలైన సూర్య ప్రతి సినిమా తెలుగులోను డబ్ అవుతుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ సూర్య సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం కంగువ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సూర్య.
తాజాగా సూర్య నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో సూర్య బాలకృష్ణతో కలిసి తెగ సందడి చేశారు. ఎన్నో విషయాలను పంచుకున్నారు సూర్య. అలాగే తన అభిమాన నటి ఎవరో కూడా ఈ షోలో రివీల్ అయ్యింది. ముందుగా సూర్యను ఈ ప్రశ్న అడగ్గా ఆయన తప్పిచుకున్నారు. సూర్య తమ్ముడు కార్తీకి బాలయ్య ఈ షో నుంచి ఫోన్ చేశారు. జ్యోతికా కాకుండా సూర్యకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని కార్తీని అడిగారు. దానికి కార్తీ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
సూర్య ఫస్ట్ క్రష్ ఓ హీరోయిన్ అని చెప్పాడు. ఆ హీరోయిన్ అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం అని కార్తీ చెప్పాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ గౌతమి. ఈ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సూర్య ఫస్ట్ క్రష్ అని కార్తీ రివీల్ చేశాడు. సూర్య ప్రస్తుతం కొత్త సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కరుప్పు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.