AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులార్ అయ్యారు. ఈ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తర్వాత చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు. వేణు , ధన రాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హైపర్ ఆది, రాఘవ, గెటప్ శ్రీను ఇలా కొంతమంది కమెడియన్స్ గా చేస్తున్నారు.

Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..
Jabardasth Sunny
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2025 | 5:53 PM

Share

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది దర్శకులుగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే ఇంకొంతమంది కమెడియన్స్ గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఇక కొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకున్నటున్నారు. ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కమెడియన్స్ లో సన్నీ ఒకరు. సుడిగాలి సుదీర్ టీమ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్నీ.

తన కామెడీతో .. పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. సన్నీ ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది. ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ. ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ.. లైఫ్ ను వదిలేశాడు సన్నీ. ఈ విషయాన్నీ తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ, పెళ్లి పై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు సన్నీ.

జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మీ మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా.. సన్నీ మాట్లాడుతూ.. ఓ అమ్మాయిని ప్రేమించా.. ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది. మరో కమెడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సన్నీ మంచి కోటీశ్వరుడు. బోలెడన్ని డబ్బులు ఉన్నాయి.. కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను వదిలేసుకున్నాడు. సన్నీ అన్న, వదిన ఇద్దరూ డాక్టర్స్.. అంత డబ్బున్నా వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు.. మా రూమ్స్ కు వచ్చి తాగి పడుకుంటాడు. అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం.. కానీ ఇంత బాధ ఉందా అన్న అని.. నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇలా సింగల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఆరోజు అలా జరిగే సరికి మా ఆయనను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చా
ఆరోజు అలా జరిగే సరికి మా ఆయనను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చా