AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టాలీవుడ్ లో ఒకప్పుడు ఈ భామ తోప్ హీరోయిన్.. మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యింది.

మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2025 | 9:30 AM

Share

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్ముడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది ఈ చిన్నది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఉదయ్ కిరణ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఆ సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. అంతే కాదు ఈ అమ్మడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తుంది ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్  హిందీలోనూ నటించి ఆకట్టుకుంది. తెలుగులో ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇంతకు ఆమె ఎవరంటే ఆమె పేరు అనిత హస్సానందని. తేజ దర్శకత్వంలో 2001లో విడుదలైన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనిత హస్సానందని. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీగా నిలిచింది నువ్వు నేను సినిమా. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నువ్వు నేను సినిమా తర్వాత మరోసారి ఉదయ్ కిరణ్ తో శ్రీరామ్ సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి

సినిమాలతో పాటు టెలివిజన్ లోనూ అనిత మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిత తన లవ్ స్టోరీని బ్రేకప్ గురించిన విషయాలను పంచుకుంది. గతంలో అనిత ఎజాజ్‌ ఖాన్ అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. దీని గురించి అనిత మాట్లాడుతూ.. “నా జీవితంలో ఉన్న కొన్ని శాశ్వత సంబంధాలలో ఒకటి ఎజాజ్‌తో. నేను నా తల్లికి వ్యతిరేకంగా వెళ్లి అతనిని ప్రేమించాను. అతను వేరే మతానికి చెందినవాడు కాబట్టి మా సంబంధాన్ని మా అమ్మ వ్యతిరేకించింది. అతను ముస్లిం, నేను హిందువును. అతను నన్ను ఎప్పుడూ నేరుగా తిరస్కరించలేదు. కానీ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. కానీ మా సంబంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎవరైనా మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు. ఇది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అతనితో పిచ్చి ప్రేమలో ఉన్నాను. నేను ప్రేమించిన వ్యక్తి కోసం నేను పూర్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఇప్పుడు బాధపడుతున్నాను. వాటన్నింటినీ అధిగమించడానికి నాకు ఏడాది పట్టింది. నేను చాలా ఒంటరిగా ఫీలయ్యాను. మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించే వారితో ఎప్పుడూ ఉండకూడదనేది చాలా ముఖ్యమైన విషయం. వారి ఫోన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమస్య. వ్యక్తి తన ఫోన్‌ను దాచిపెడితే, ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని అర్థం. “ఒక వ్యక్తి మిమ్మల్ని మీ కుటుంబం ,స్నేహితుల  నుంచి దూరం చేయకూడదు అని అనిత చెప్పుకొచ్చింది. ఇక 14 అక్టోబర్ 2013న అనిత గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..