AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఆ హీరోతో పెళ్లైన 6 నెలలకే విడాకులు.. గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో రిలేషన్ షిప్స్, విడాకులు సర్వ సాధారణం. వివిధ కారణాలతో ఎందరో స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ భాగస్వాములతో విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ టాలీవుడ్ జంట మాత్రం పెళ్లైన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయారు.

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఆ హీరోతో పెళ్లైన 6 నెలలకే విడాకులు.. గుర్తు పట్టారా?
Tollywood Bold Actress
Basha Shek
|

Updated on: Jul 07, 2025 | 6:07 PM

Share

ఈ టాలీవుడ్ హీరో, హీరోయిన్లు సుమారు ప్రేమలో మునిగి తేలారు. ఒకరి మనసులు ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారు. తమ ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడవ్వడంతో ఎంతో ఘనంగా పెళ్లిపీటలెక్కారు. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. కానీ ఏమైందో తెలియదు కానీ పెళ్లైన 16 రోజులకే ఈ ఆలు మగల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మూడు నెలలకే ఇద్దరూ విడిపోయారు. ఆరు నెలలకే విడాకులు తీసుకున్నారు. మొత్తానికి వీరి మూడేళ్ల ప్రేమ మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు వారి ప్రొఫెషనల్ లైఫ్ లో బిజి బిజీగా ఉంటున్నారు. సినిమాలు, టీవీ షోలతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వారెవరో కాదు టాలీవుడ్ నటి ఎస్తర్ నోరోన్హా- నోయల్. పై ఫొటోలో స్కూల్ డ్రెస్ లో ఉన్నది ఎస్తర్ నోరోన్హానే. 2013లో పూరి జనగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 1000 అబద్దాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. కానీ మొదటి సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సునీల్ తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తీసుకువచ్చింది.

తెలుగుతో పాటు పలు కన్నడ సినిమాల్లో నటించింది ఎస్తర్. అయితే హీరోయిన్ గా మాత్రం క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఎస్తర్ పర్సనల్‌ లైఫ్ లోనూ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. కెరీర్ బిజీగా ఉన్న టైంలోనే టాలీవుడు నటుడు, ర్యాపర్ కమ్ సింగర్ అయిన నోయల్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2019లో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్ని నెలలకే విభేదాల కారణంగా విడిపోయారు. అయితే ఈ విడాకులకు కారణం ఏంటనేది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఎస్తర్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా ఎస్తర్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజి బిజీగా ఉంటోంది. రెక్కీ, ‘చాంగురే బంగారు రాజా ,కల్యాణ్ రామ్ డెవిల్, టెనంట్, తల తదితర సినిమాల్లో ఈ బ్యూటీ కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.