Fish Venkat: ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ ఆర్థిక సాయం! నటుడి భార్య ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అతను ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. మరోవైపు చికిత్సకు ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కూతురు కోరుతున్నారు.

100కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. రెండూ కిడ్నీలు చెడిపోవడంతో వెంటి లేటర్ పై అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అసలే ఆర్థిక సమస్యలు దీనికి తోడు ఫిష్ వెంకట్ ఆస్పత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా అమర్చాలని డాక్టర్లు చెబుతున్నారు. అతను బతకాలంటే ఇదొక్కటే మార్గమని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు కనీసం రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ వద్ద అంత డబ్బు లేదని, సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె స్రవంతి కోరుతున్నారు. అయితే ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కు ప్రభాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమయ్యే రూ. 50 లక్షలను ఏర్పాటు చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతినే చెప్పిందంటూ కొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు.
ప్రభాస్ టీమ్ సాయం చేసినట్లు వస్తోన్న కథనాలపై ఫిష్ వెంకట్ భార్యను సంప్రదించగా తమకు ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని కన్నీరుమున్నీరైంది. అంటే ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ టీమ్ హెల్ప్ చేస్తోందన్నది జస్ట్ రూమర్ మాత్రమే అని తేలిపోయింది.
గబ్బర్ సింగ్ గ్యాంగ్ మాత్రమే..
#Exclusive: Fake News Alert#FishVenkat కి #Prabhas సాయం అనేది ఫేక్ న్యూస్. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా…గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ రాలేదు,ఫోన్ చెయ్యలేదు అని చెప్పారు… ఇంకా ICU లో ఉన్నారట…కిడ్నీ transplant…
— Taraq(Tarak Ram) (@tarakviews) July 4, 2025
డాక్టర్లు ఏమంటున్నారంటే?
కాగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ ఇలా చెప్పుకొచ్చారు.. ‘ వెంకట్ పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన మళ్లీ మామూలు మనిషి కావొచ్చు. ప్రస్తుతం ఆయనను బతికించుకునేందుకు ఇదొక్కటే మార్గం. ప్రస్తుతం డయాలసిస్ చేస్తే ఫిష్ వెంకట్ పరిస్థితి మెరుగవచ్చు… కానీ మళ్లీ సిక్ అవ్వడంఖాయం. పైగా ఆయన ఎక్కువగా స్పృహలో ఉండటం లేదు. ఒక్క డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీను మారిస్తే బ్రతికే అవకాశం ఉంది’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..