Tollywood: 9వ తరగతిలోనే అతనితో ప్రేమలో.. అది చూసి నా గుండె బద్దలైంది.. బిగ్ బాస్ బ్యూటీ బ్రేకప్ స్టోరీ
ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ రియాలిటీ షోకు వెళ్లొచ్చిందీ అందాల తార. బిగ్ స్క్రీన్ పై మెరవకున్నా బుల్లితెరపై మాత్రం బాగానే ఛాన్సులు అందుకుంటోందీ అందాల తార. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బ్రేకప్ స్టోరీని బయట పెట్టింది.

టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతోన్న తెలుగమ్మాయిల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు. మొదట యాంకర్ గా కెరీర్ ప్రారంభించిందీ అందాల తార. ఆ తర్వాత కొన్ని టీవీ షోల్లోనూ, సినిమాల్లోనూ సందడి చేసింది. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాక ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగిపోయింది. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లొచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు టీవీ షోస్, ఓటీటీ షోలతో బిజీగా ఉంటోంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీని అందరితో పంచుకుంది. ‘ నేను తొమ్మిదో తరగతి చదువుకుంటున్నప్పడే లవ్ లో పడ్డాను. అతను అప్పుడు విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో ఉండేదాన్ని. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి నుంచి హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడే మా బావకు కూడా జాబ్ వచ్చింది. దీంతో ఇద్దరం కలిసి ఒకే రూమ్ తీసుకుని మూడేళ్లు కలిసి ఉన్నాం. ఇద్దరం చాలా డీప్ గా కనెక్ట్ అయిపోయాను’
‘అయితే ఆ తర్వాత తనకు నేను బోర్ కొట్టేశానేమో. ఓ రోజు చూడకూడనిది చూశాను. అప్పుడే నా గుండెలు బద్దలైపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నాం. మళ్లీ అతను రిక్వెస్ట్ చేస్తే ఇంకో రెండేళ్లు కలిసి ఉన్నాం. అప్పుడే నాకు ఆర్జే కావాలని ఉందని మనసులో మాట చెప్పాను. తను కూడా ఒప్పుకుంటే ఓ ప్రాక్టీస్ కోర్స్ లో చేరాను. అప్పుడు నాకు ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అది మా బావకు అసలు నచ్చలేదు. నాపై అనుమానం పెంచుకున్నాడు. కావాలనే నన్ను టార్చర్ చేశాడు. ఆ అబ్బాయితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. కానీ మా బావ నన్ను అపార్థం చేసుకున్నాడు. దాంతో ఇద్దరం విడిపోయాం. ఇప్పటికీ అతను నాకు గుర్తుకు వస్తుంటాడు. మా నాన్నలేకపోవడంతో అతని కేరింగ్ కు అడిక్ట్ అయిపోయాను’ అంటూ ఎమోషనల్ అయ్యిందీ ముద్దుగుమ్మ.
అరియానా లేటెస్ట్..
View this post on Instagram
ఇలా తన లవ్, బ్రేకప్ విషయాలతో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ మరెవరో కాదు అరియానా గ్లోరీ. బిగ్ బాస్ తో పాటు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో తెగ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, ఓటీటీషోస్ లోనూ సందడి చేస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.