Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముంబై టు గోవా.. 59 ఏళ్ల వయసులో 600 కి.మీ. పరుగులు తీసిన స్టార్ నటుడు.. ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా అందరూ గోవా ఎందుకు వెళతారు? అక్కడ బీచ్ లో బీర్లతో చిల్ అవ్వాలనుకుంటారు. పార్టీల్లో మునిగి తేలాలనుకుంటారు? అయితే ఈ స్టార్ నటుడు మాత్రం ఓ సామాజిక దృక్పథంతో ముంబై నుంచి గోవా పయనమయ్యాడు. అది కూడా 59 ఏళ్ల వయసులో..

Tollywood: ముంబై టు గోవా.. 59 ఏళ్ల వయసులో 600 కి.మీ. పరుగులు తీసిన స్టార్ నటుడు.. ఎవరో గుర్తు పట్టారా?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jul 03, 2025 | 7:29 AM

Share

సాధారణంగా 60 ఏళ్లకు దగ్గరైన వారు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు. వృద్ధాప్య సమస్యలు, మోకాళ్ల నొప్పులంటూ పెద్దగా బయట తిరగరు. చిన్న చిన్న పనులకు కూడా వేరొకరి సాయం తీసుకుంటుంటారు. అదే సమయంలో కొందరు మాత్రం 60 ఏళ్ల వయసులోనూ సాహసాలు చేస్తుంటారు. యువకులకు కూడా సాధ్యం కానీ పనులు సైతం చేస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటారు. ఇలాంటి వీరి దృష్టిలో ఏజ్ జస్ట్ ఒక నంబర్ మాత్రమే. ఈ స్టార్ నటుడు కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతాడు. 59 ఏళ్ల ఈ నటుడు ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. కేవలం 5 రోజుల్లోనే ఈ ప్రయణం పూర్తి చేసిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ ప్రయాణంలో భాగంగా ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్‌, 21కిమీ పరుగు.. ఇలా విభజించుకుంటూ నటుడు ప్రయాణించాడు. గత నెల అంటే జూన్‌ 26న ముంబైలోని శివాజీ పార్క్‌ నుంచి ఈ పరుగు‌ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్‌ బెల్ట్‌ను పూర్తిగా కవర్‌ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్‌ 30న గోవాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో తన సాహస ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడీ స్టార్ నటుడు. అందులో తను సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ నటుడెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఫిట్‌నెస్‌ ఐకాన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మిలింంద్ సోమన్.

‌ ‘ది ఫిట్‌ ఇండియా రన్‌’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్‌ ఈవెంట్‌ లో భాగంగా మిలింద్ సోమన్ ఈ సాహాస యాత్ర చేపట్టాడు. ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరాన్ని 5 రోజుల్లో పూర్తి చేశాడు. ‘ఫిట్‌ ఇండియన్‌ రన్‌ లో భాగంగా 5 రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కొనే ఛాలెంజ్. ఇలాంటి ఈవెంట్స్‌లో పార్టిసిపేట్‌ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్‌ విషెస్‌ చెప్పడం మరెన్నో అఛీవ్‌ చేయాలని కోరుతుండడం నాకు మరింత స్ఫూర్తినిస్తుంది. ప్రతి భారతీయుడు ఫిట్‌ ఇండియన్‌ అవ్వాలి. జైహింద్‌’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు మిలింద్ సోమన్.

ఇవి కూడా చదవండి

మిలింద్ సోమన్ వీడియో..

కాగా బాలీవుడ్ లో స్టార్ నటుడిగా వెలుగొందుతోన్న మిలింద్ సోమన్ తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించాడు. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సత్యమేవ జయతే సినిమాలో ఈ నటుడు ఓ కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో