AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Rawat: మొదటి భార్య నుంచి వేధింపులు.. పెళ్లయిన 5 నెలల్లోనే విడాకులు.. ప్రదీప్ రావత్ వైవాహిక జీవితంలో కుదుపులు..

నటుడు ప్రదీప్ రావత్ మరణంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. మంగళవారం (ఆగస్ట్ 4న) సాయంత్రం కన్నుమూశారు. దీంతో ప్రదీప్ మృతిపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు.. ఇదిలా ఉంటే ప్రదీప్ పర్సనల్ లైప్ గురించి ఆసక్తికర విషయాలు వైరలవుతున్నాయి.

Pradeep Rawat: మొదటి భార్య నుంచి వేధింపులు.. పెళ్లయిన 5 నెలల్లోనే విడాకులు.. ప్రదీప్ రావత్ వైవాహిక జీవితంలో కుదుపులు..
Pradeep Rawat Fam
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2026 | 12:58 PM

Share

సినీ నటుడు ప్రదీప్ రావత్ మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆగస్ట్ 4న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ మృతితో భారతీయ సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే అతడి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అతడి వైవాహిక జీవితం కూడా కలహాలతో కూడుకున్నది. అతనికి రెండుసార్లు పెళ్లయింది. పెళ్లయ్యాక అతని మొదటి భార్య అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో, ఐదున్నర నెలల్లోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అతడి మొదటి భార్య పేరు, వివరాలు తెలియకపోయినప్పటికీ.. గతంలో ఓ ఇంటర్వ్యూ తన ఫస్ట్ భార్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించారు ప్రదీప్ రావత్.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ప్రదీప్ రావత్ మాట్లాడుతూ.. “నా భార్య గర్భవతిగా ఉంది, ఆమె కడుపులో నా బిడ్డ ఉంది. నా నుండి డబ్బు ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తూ, ఆమె నాపైనా, నా కుటుంబం పైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో సెక్షన్ 498-ఎ కింద చాలా గందరగోళం జరిగింది. మద్యం సేవించి మా కూతురిని నేనే చంపానని ఆమె కుటుంబం నాపై ఆరోపణలు చేసింది. ఆ కేసు నెల రోజుల్లోనే క్లోజ్ అయ్యింది. ఆమె వేరొకరితో ప్రేమలో పడి అతడిని పెళ్లిచేసుకుంది. తర్వాత ఆమె మా లాయర్ వద్దకు వచ్చి అన్ని విషయాలు ఒప్పుకుంది. దీంతో ఆ కేసు తొందరగా క్లోజ్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

మొదటి వివాహ జీవితం విచ్ఛిన్నం కావడంతో చాలా సంవత్సరాలపాటు ప్రదీప్ రావత్ ఒంటరిగా ఉన్నాడు. తర్వాత దక్షిణాదికి చెందిన కళ్యాణి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వీర్దదరు చిరంజీవి స్టాలిన్ సినిమా సెట్ లో కలుసుకున్నారు. ఒకరోజు కళ్యాణి కారు పాడైపోగా, ఆమె మేనేజర్ ప్రదీప్‌ను తన కారులో ఒక నటిని పంపగలరా అని అడిగారు. ప్రదీప్ అంగీకరించగా, ఆ నటి కళ్యాణి. వారు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. కొన్ని నెలలు డేటింగ్ చేసిన తర్వాత, 2006లో వారికి వివాహం జరిగింది. వీరికి విక్రమాదిత్య అనే కుమారుడు ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us